»   » బిగ్‌బాస్ 11లో సన్నీలియోన్..సల్మాన్‌ ఒక్క ఎపిసోడ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకే!

బిగ్‌బాస్ 11లో సన్నీలియోన్..సల్మాన్‌ ఒక్క ఎపిసోడ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకే!

Written By:
Subscribe to Filmibeat Telugu

హిందీ బిగ్‌బాస్ రియాల్టీ గేమ్ షోకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల ఆరంభం నుంచి సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించే ఈ ప్రొగ్రాం ప్రారంభం కానున్నది. ఇప్పటికే కార్యక్రమం కోసం సెలబ్రిటీల ఎంపిక పూర్తి చేసినట్టు సమాచారం. అయితే సెలబ్రిటీల వివరాలను చాలా సీక్రెట్‌గా పెట్టడం గమనార్హం. అయితే ఈ కార్యక్రమానికి సల్మాన్ తీసుకునే రెమ్యూనరేషన్ అంశం మీడియాలో సెన్సేషనల్‌గా మారింది. ఈ షోలో పాల్గొనే వారి ఐదుగురి పేర్లు లీక్ అయినట్టు మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతున్నది.

టీఆర్పీలతో దూసుకెళ్తున్న..

టీఆర్పీలతో దూసుకెళ్తున్న..

హిందీ బిగ్‌బాస్‌ రియాల్టీ షోకు దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో టెలివిజన్ ప్రేక్షకులకు తెలిసిందే. ప్రతి సీజన్‌కు రికార్డు టీఆర్పీలతో ఈ రియాల్టీ షో దూసుకెళ్తున్నది. అందుకు తగినట్లే ఈ షో హోస్ట్ సల్మాన్‌ఖాన్ తన రెమ్యునరేషన్‌ను పెంచేయడం మీడియాలో చర్చనీయాంశమైంది.

Bigg Boss Winner : Shiva Balaji Won because of Pawan Kalyan
అక్టోబర్ 1 నుంచి

అక్టోబర్ 1 నుంచి

బిగ్ బాస్ 11 అక్టోబర్ 1 నుంచి బిగ్‌బాస్ 11వ సీజన్ ప్రారంభం కానున్నది. ఈ రియాల్టీ షోకు ఎనిమిదోసారి సల్మాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్ కోసం సల్మాన్ ఒక్కో ఎపిసోడ్‌కు రూ.11 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే టెలివిజన్ హిస్టరీలో ఇది నిజంగా ఓ రికార్డే.

తొలిసారి సల్మాన్

తొలిసారి సల్మాన్

2010లో బిగ్‌బాస్ సీజన్ 4కు సల్మాన్ తొలిసారి హోస్ట్‌గా వ్యవహరించాడు. 2011లో బిగ్‌బాస్ 5ని సంజయ్‌దత్ హోస్ట్ చేశాడు. తన తొలి సీజన్‌లో సల్మాన్ ఎపిసోడ్‌కు రూ.2.5 కోట్లు తీసుకున్నాడు. బిగ్‌బాస్ 7లో ఆ మొత్తాన్ని ఏకంగా రెట్టింపు చేసి ఎపిసోడ్‌కు రూ.5 కోట్లు అందుకున్నాడు.

11 కోట్ల రెమ్యునరేషన్

11 కోట్ల రెమ్యునరేషన్

ఇక బిగ్‌బాస్ సీజన్ 8లో రూ.5.5 కోట్లు, సీజన్ 9లో రెమ్యునరేషన్‌ను రూ.7 నుంచి 8 కోట్లకు పెంచేశాడు. గతేడాది 10వ సీజన్‌లో ఒక్కో ఎపిసోడ్‌కు రూ.8 కోట్లు అందుకున్న సల్మాన్.. ఈసారి దానిని ఏకంగా రూ.11 కోట్లకు పెంచడం విశేషం.

సెలబ్రిటీలు వీరే..

సెలబ్రిటీలు వీరే..

బిగ్‌బాస్ 11 కార్యక్రమంలో పాల్గొనే వారిలో వినిపిస్తున్న పేర్లు బాలీవుడ్ తార సన్నీలియోన్, బీటల్ ఎల్డోన్. ఈమె టర్కీకి చెందిన రచయిత. ఈమెకు సంబంధించిన ఫోటోను బిగ్ బాస్ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇంకా కమెడియన్ జకీర్ ఖాన్, యూట్యూబ్ సెన్సేషన్ హర్ష్ బెనీవాల్, టీవీ నటుడు సిజానే ఖాన్ తదితరులు ఉన్నారు.

బిగ్‌బాస్ ఇల్లు ఇదే..

బిగ్‌బాస్ ఇల్లు ఇదే..

ఇటీవల బిగ్‌బాస్ 11 షోకు సంబంధించిన ఇంటి ఫొటోలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విశాలమైన, పకడ్బందీగా ఉన్న ఇళ్లు అందరిని ఆకర్షిస్తున్నది. ఆ ఇల్లు ఇదిగో మీకోసం...

English summary
Each year Bigg Boss premieres on the television, it breaks all the TRP records. The nation loves the show and eagerly waits every year. It’s time for the season 11 to make its way on the TV. The show will air on Oct. 1. Salman Khan will get a whopping Rs.11 crore per episode for hosting the 11th season of Bigg Boss.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu