»   » రవితేజ 'కిక్' హిందీ రీమేక్ లో ఆ స్టార్...

రవితేజ 'కిక్' హిందీ రీమేక్ లో ఆ స్టార్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రవితేజ, ఇలియానా కాంబినేషన్ లో వచ్చి విజయం సాధించిన 'కిక్‌' చిత్రాన్ని హిందీలో పునర్నిర్మిస్తున్నారు. ఈ రీమేక్ లో సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటిస్తారు. అలాగే సల్మాన్ ఖాన్ లేటెస్ట్ హిట్ దబాంగ్ లో హీరోయిన్ గా చేసిన సోనాక్షి సిన్హా ఆయనకు జోడీగా చేయనుంది. అలాగే కిక్ తమిళ వెర్షన్ ని ఎడిటర్ మోహన్ కుమారుడు జయం రవితో నిర్మించారు. అయితే ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద పెద్ద ప్లాప్ గా నమోదయింది. తమన్నా అందచందాలు కూడా సినిమాని నిలబెట్టలేకపోయాయి. అయితే ఈ కిక్ రీమేక్ పై సల్మాన్ ఖాన్ బాగా నమ్మకంగా ఉన్నారు. తాను చేసిన 'పోకిరి' రీమేక్‌ హిట్టవటంతో ఈ చిత్రం కూడా అదే రేంజిలో వర్కవుట్ అవుతుదని నమ్ముతున్నాడు. ఇక ప్రస్తుతం సల్మానే తెలుగులో హిట్టయిన 'రెడీ' రీమేక్‌ లో నటిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu