»   » బీయింగ్ స్మార్ట్... మొబైల్ రంగం లోకి సల్మాన్ అడుగు

బీయింగ్ స్మార్ట్... మొబైల్ రంగం లోకి సల్మాన్ అడుగు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఆయన బీయింగ్ హ్యూమన్ క్లాతింగ్ పేరిట బ్రాండెడ్ దుస్తులను విక్రయిస్తుండగా, బీయింగ్ స్మార్ట్ అనే మరో కంపెనీని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ మొబైల్ కంపెనీ కోసం బీయింగ్ స్మార్ట్ అనే ట్రేడ్ మార్క్ ను సైతం రిజిస్టర్ చేయించాడు.

సామాజిక కార్యక్రమాలకు

సామాజిక కార్యక్రమాలకు

పేద, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి తీసుకువచ్చే ప్లాన్ లో ఉన్నాడు సుల్తాన్. బీయింగ్ హ్యూమన్ సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సల్మాన్, తన కంపెనీల ద్వారా వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని సామాజిక కార్యక్రమాలకు వెచ్చిస్తున్నాడు.

చాలా రకాల కేసులు

చాలా రకాల కేసులు

"బాలీవుడ్ బ్యాడ్ బోయ్" కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి బాలీవుడ్ లో ఉన్న మరో పేరు. సల్మాన్ పై ఉన్న చాలా రకాల కేసులు కూడా ఇదే విషయం నిజమేమో అన్న భావనని కలిగిస్తాయి. సల్మాన్ జీవితం లోకి వచ్చిన ప్రతీ అమ్మాయీ ఆయన విపరీత ప్రవర్తన కారణం గానే దూరం అయ్యారన్నది నిజం.

బీయింగ్ హ్యూమన్ ద్వారా

బీయింగ్ హ్యూమన్ ద్వారా

కానీ సల్మాన్ లో ఉన్న రెండో కోణం అతితక్కువ సందర్భాల్లోనే కనిపిస్తుంది.బీయింగ్ హ్యూమన్ ద్వారా సల్మాన్ ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసాడు. అంతే కాదు తన సంపాదనలొనూ కొంత భాగం ఈ చారిటీ కోసం ఖర్చు చేస్తున్నాడు కూడా. 2007లో కొన్ని సంస్థలతో కలసి బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ను స్థాపించిన సల్మాన్. ఆర్థిక సమస్యల్లో ఉన్న ఎంతో మందికి విద్య, వైద్య సేవలను ఈ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నారు.

అధిక మొత్తం లో రెమ్యునరేషన్

అధిక మొత్తం లో రెమ్యునరేషన్

ఆమధ్య సల్మాన్ అధిక మొత్తం లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంటూ రేగిన వివాదం సమయం లో "మీరు తీసుకుంటున్న జీతాల విషయంపై నాకు ఆసక్తి లేదు... మరి, నా జీతం విషయంపై మీకు ఎందుకంత ఆసక్తి? నేను తీసుకునే రెమ్యునరేషన్ పెరిగినా, అది బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ కే వెళుతుంది" అని చెప్పాడు.

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ

అదే సంస్థ కోసం నిధుల సమకూర్పులో భాగంగా మొదలు పెట్తబోతున్న మొబైల్ కంపెనీ కోస, బీయింగ్ స్మార్ట్ కంపెనీ ట్రేడ్‌మార్క్‌కు సల్మాన్ దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. కాగా ఈ కంపెనీ పేరిట ఎంట్రీ, మిడ్ రేంజ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లను తయారు చేయనున్నారు. రూ.20వేల లోపు ఉండే ఫోన్ల తయారీకి గాను బీయింగ్ స్మార్ట్ ఇప్పటికే పలు చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలిసింది

English summary
Bollywood star Salman Khan is delving into a new venture and this time it's a smartphone business
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu