సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం.. ఖబర్దార్.. షూటింగ్ రద్దు..
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని కొందరు అగంతకులు బెదిరింపులకు పాల్పడటం సినీ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. బెదిరింపుల కారణంగా రేస్3 షూటింగ్ రద్దు చేశారు. పోలీసుల రక్షణతో సల్మాన్
Recommended Video

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని కొందరు అగంతకులు బెదిరింపులకు పాల్పడటం సినీ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. బెదిరింపుల కారణంగా రేస్3 షూటింగ్ రద్దు చేశారు. పోలీసుల రక్షణతో సల్మాన్‌ను తన నివాసానికి తరలించారు. బెదిరింపులకు పాల్పడిన వారెవరూ అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కృష్ణ జింకల వివాదం
కృష్ణ జింకలను ఆరాధించే బిష్ణ్నోయి కమ్యూనిటికి చెందిన గ్యాంగస్టర్ లారెన్స్ బిష్నోయి బెదిరింపులకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పదేళ్ల క్రితం జోధ్‌పూర్‌లో కృష్ణ జింకలను వేటాడిన విషయంలో సల్మాన్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం..
సల్మాన్ ఖాన్‌ను జోధ్‌పూర్‌లో చంపేస్తాం. అప్పుడే మా కమ్యూనిటి సత్తా ఏమిటో తెలుస్తుంది. ఏదైనా పెద్ద నేరం చేయాలని పోలీసులు భావిస్తే వెంటనే నేను సల్మాన్ ఖాన్‌ను చంపేస్తా. అది కూడా జోధ్‌పూర్‌లోనే అని లారెన్స్ బిష్నోయి హెచ్చరికలు జారీ చేశారు. లారెన్స్‌పై దాదాపు 20కిపైగా హత్యాయత్నం, కార్ల హైజాక్, గొలుసు దొంగతనాలు, తదితర కేసులు నమోదయ్యాయి.

రేస్3 షూటింగ్ సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ముంబైలో రేస్3 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సల్మాన్‌ను చంపేస్తామని బెదిరింపులు వచ్చి నేపథ్యంలో ముంబై ఫిల్మ్ సిటీలో జరుగుతున్న రేస్3 షూటింగ్ ప్రాంతానికి పోలీసులు చేరుకొని నిర్మాత రమేష్ తురానీకి ఈ విషయాన్ని వెల్లడించారు. దాంతో నిర్మాత వెంటనే షూటింగ్‌ను నిలిపివేశారు.

గోప్యంగా సల్మాన్ వార్త
ఆరుగురు పోలీసుల సహాయంతో సల్మాన్‌ను తన నివాసానికి తరలించారు. సల్మాన్‌కు బెదిరింపుల విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచడంతో వార్త బయటకు పొక్కలేదు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం గమనార్హం.


Click it and Unblock the Notifications











