»   » అసిన్ లేకపోతే సినిమా చేయనని బెదిరిస్తున్న హీరో

అసిన్ లేకపోతే సినిమా చేయనని బెదిరిస్తున్న హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్ డ్రీమ్స్ ప్లాప్ అయినా సల్మాన్ ఖాన్..అసిన్ ని వదలలేదు. తాజాగా వీరిద్దరూ కలిసి తెలుగులో హిట్టయిన రెడీ రీమేక్ లో చేస్తున్నారు. అంతేగాక అసిన్ ని లేటెస్ట్ గా మరో చిత్రంలో తన సరసన బుక్ చేయమని సల్మాన్ ఖాన్ పట్టుపడుతున్నాడు. బాలీవుడ్‌ దర్శకనిర్మాత రవి చోప్రా స్వీయ దర్శకత్వంలో త్వరలోనే ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దీంట్లో హీరోగా సల్మాన్‌ ఖాన్‌ను ఎంపిక చేసుకున్నారు. హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను తీసుకోవాలని రవి చోప్రా అనుకొంటుంటే..సల్మాన్‌ ఖాన్‌ మాత్రం అసిన్‌ను నాయికగా పెట్టుకోమని పట్టుబడుతున్నాడుట.అయితే రవిచోప్రా మాత్రం ప్రియాంక కావాలని నిర్ణయించుకుని మాట ఇచ్చానంటున్నాడు. అవసరమైతే సల్మాన్ ని మారుస్తా కానీ ప్రియాంకను వదిలే ప్రసక్తి లేదని తన సన్నిహితులతో చెప్తున్నాడు. ఈ సినిమాలో సల్మాన్‌ 'పార్ట్‌నర్‌' చిత్ర నటుడు గోవిందా కూడా మరో కీలకపాత్ర చేస్తున్నాడు. అలాగే అసిన్ ని వదులుకుని నిర్మాత చెప్పినట్లు సల్మాన్ చేస్తాడా లేదా అన్నది..ఎలాంటి నిర్ణయం తీసుకొంటారన్నది తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాలి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu