కృష్ణ జింకల వేట కేసు.. సల్మాన్ ఖాన్‌కు ఊరట
రాజస్థాన్ కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ఊరట లభించింది. ఈ కేసులో తీర్పును రాజస్థాన్ హైకోర్టు జూలై 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చేసిన అప్పీల్‌పై విచారణ జరుగుతున్నది. వాస్తవానికి గురువారం (ఏప్రిల్ 4వ తేదీ) ఈ తీర్పు వెల్లడించాల్సింది.
అయితే ఈ తీర్పును వాయిదా వేస్తూ ఈ కేసులోని ప్రతీ ఒక్కరు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోర్టు తన ఆదేశాలల్లో పేర్కొన్నది. 1998లో హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ సమయంలో జోధ్‌పూర్‌కు సమీపంలోని కంకణి వద్ద కృష్ణ జింకలను వేటాడినట్టు కేసు నమోదైన సంగతి తెలిసిందే.

ఈ కేసులో సైఫ్ ఆలీ ఖాన్, నీలమ్, టబు, సొనాలి బింద్రే నిందుతులుగా ఉన్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 51, 149 కింద కేసు నమోదైంది. ఈ కేసులో సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూరు కోర్టు ఐదేళ్ల శిక్షను విధించింది. ఒక రోజు శిక్ష అనంతరం బెయిల్‌పై సల్మాన్ బయటకు వచ్చారు. ఈ శిక్షను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


Click it and Unblock the Notifications











