‘తుఫాన్’పై సల్మాన్ తండ్రి కేసు, కోర్టులో చుక్కెదురు!
News
oi-Santhosh
By Bojja Kumar
|
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' చిత్రం ఈ నెల 6వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. ఇదే చిత్రాన్ని తెలుగులో 'తుఫాన్' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈచిత్రం కోర్టు కేసుల కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రం అన్ని ఇబ్బందుల నుంచి బయట పడింది.
'తుఫాన్' మూవీ ఎదుర్కొన్న కేసుల్లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్-జావేద్ అక్తర్ వేసిన కేసు కూడా ఒకటి. 1975లో వచ్చిన ఒరిజినల్ 'జంజీర్' చిత్ర రచయితలైన వీరు ఆ చిత్రాన్ని మళ్లీ తెరకెక్కించడంపై కాపీరైట్ యాక్టు కింద తమకు రాయల్టీ చెల్లించాలని కోర్టు కెక్కారు. అయితే సెప్టెంబర్ 2, 2013న జరిగిన విచారణలో బాంబే హైకోర్టు వీరి పిటీషన్‌ను తోసి పుచ్చింది. వారి పిటీషన్ సరిగా లేదని కోర్టు అభిప్రాయ పడింది.
సినిమా వివరాల్లోకి వెళితే...1975లో అమితాబ్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ 'జంజీర్' చిత్రానికి రీమేక్‌గా అదే పేరుతో తెరకెక్కించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఏసిపీ విజయ్ ఖన్నా పాత్రలో నటించాడు. షేర్ ఖాన్ పాత్రలో హిందీలో సంజయ్ దత్, తెలుగులో శ్రీహరి పోషించగా, మోనా డార్లింగ్ పాత్రలో నటించింది. తనికెళ్ల భరణి, దేవ్ గిల్ కీలకమైన పాత్రలు పోషించారు.
రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, అడాయ్ మెహ్రా ప్రొడక్షన్స్, మరియు ఫ్లయింగ్ టర్టిల్ ఫిల్మ్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ హీరోల ఫేవరెట్ దర్శకుడు అపూర్వ లఖియా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా హీరోయిన్. శ్రీహరి ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ కానుంది. హిందీలో సంజయ్ దత్ పోషించిన పాత్రను తెలుగులో శ్రీహరి పోషించారు.
Ram Charan Teja's latest outing Toofan and its Hindi version Zanjeer have cleared from all legal problems on September 2, 2013. The Bombay High Court has dismissed the application of Salman Khan's father Salim and Javed Akhtar, who were seeking interim injunction on the release of director Apoorva Lakhia's Zanjeer remake starring Priyanka Chopra in the female lead.
Story first published: Wednesday, September 4, 2013, 11:26 [IST]