»   » సుల్తాన్ ముందు తలవంచిన బాహుబలి జక్కన్న సినిమాది ఇక రెండో స్థానమే

సుల్తాన్ ముందు తలవంచిన బాహుబలి జక్కన్న సినిమాది ఇక రెండో స్థానమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు సినిమా సక్సెస్ ను ఎన్ని రోజులు ఆడిందన్న అన్నలెక్కలతో చెప్పేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమా సక్సెస్ ను ఎన్ని రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది అన్న లెక్కలతో చెపుతున్నారు. స్టార్ హీరోల సినిమాలకు ఈ లెక్కలు కీలకంగా మారాయి. ముఖ్యంగా భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల నుంచి అభిమానులు అదే స్థాయి కలెక్షన్లు ఆశిస్తున్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక బడ్జెట్ తో జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి.ఇక ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ లు అంతా ఇంతా కాదు.రిలీజ్ అయిన అన్ని భాషల్లో కలెక్షన్ల సునామి స్రుష్టించి వరల్డ్ వైడ్ గా 600 కోట్లు రాబట్టింది.ఇక తర్వాత ఎన్నో సినిమాలు వచ్చినా సరే బాహుబలి రికార్డులను క్రాస్ చేయడం ఎవ్వరివల్ల కాలేదు.అంతే కాదు ఇప్పటి వరకు ఏ తెలుగు చిత్రాలనికి రాని రికార్డు ఈ చిత్రానికి రావడం అంతే కాకుండా జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు కైవసం చేసుకోవడం కూడా విశేషం.


అభిమానుల ఆశలకు తగ్గట్టు బాలీవుడ్ కండల వీరుడు వరసగా రికార్డ్ లు బ్రేక్ చేస్తున్నాడు. తన ఫ్లాప్ సినిమాలతో కూడా వందల కోట్ల వసూళ్లను సాధిస్తూ వస్తున్న సల్మాన్. హిట్ సినిమా అయితే సరికొత్త రికార్డ్ లను సెట్ చేస్తూ టాప్ స్టార్ కు టార్గెట్ సెట్ చేస్తున్నాడు. తాజాగా ఇండియాస్ బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా పేరు తెచ్చుకున్న బాహుబలి పేరిట ఉన్న రికార్డ్ ను సుల్తాన్ సినిమాతో సల్మాన్ బద్దలు కొట్టాడు.


Salman Khan's Sultan breaks records of Baahubali's

బాహుబలి రికార్డులను తిరగరాయడం సాధ్యం కాదని అందరూ అనుకున్నారు. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్తుంది..అయితే ఈ చిత్రం రిలీజ్ అయిన ఫస్ట్ డే కలేక్షన్లు బాహుబలిని మించిపోతాయనుకున్నారు..కానీ అలా జరగలేదు. ఇక బాహబలి రికార్డ్ తాకలేరన్న సమయంలో ఇప్పుడు సుల్తాన్ ఆ రికార్డ్ బ్రేక్ చేసి బాహుబలికి షాక్ ఇచ్చింది. ఫస్ట్‌డే కాకపోతే ఫస్ట్‌వీక్ అన్నట్లు మొదటివారం కలెక్షన్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించి సుల్తాన్ తన సత్తా చాటాడు.


గతేడాది 'భజరంగీ భాయిజాన్' సినిమాతో బాహుబలి లెక్కల్ని సరిచేసేందుకు ప్రయత్నించిన సల్మాన్... తృటిలో ఆ అవకాశాన్ని కొల్పోయాడు. 'బాహుబలి' మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక భాషలో రిలీజ్ అవుతూ సరికొత్త టార్గెట్స్‌ని క్రియేట్ చేస్తూ దూసుకు పోతున్నాడు. 'భజరంగీ భాయిజాన్'గా 'బాహుబలి'ని బీట్ చేయలేకపోయిన సల్లుభాయ్.. 'సుల్తాన్' గా ఆ ఫీట్ ని సాధించాడు.


Salman Khan's Sultan breaks records of Baahubali's

ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అయిన బాహుబలి సినిమా తొలి వారంలో 185 కోట్ల వసూళ్లను సాధించింది. సల్మాన్ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ తొలివారంలోనే 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన సరికొత్త రికార్డ్ ను సృష్టించాడు. ఇన్నాళ్లు తొలి వారం కలెక్షన్ల విషయంలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న బాహుబలి సుల్తాన్ దెబ్బకి రెండో స్ధానానికి పడిపోయింది. ఇప్పటికీ స్ట్రాంగ్ కలెక్షన్స్ సాధిస్తున్న సుల్తాన్ ముందు మరిన్ని రికార్డులు సాధిస్తాడన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.


ఫస్ట్ వీక్ రికార్డ్స్ లో 185 కోట్ల నెట్ కలెక్షన్లతో బాహుబలి రెండవ ప్లేస్ లోకి వెళ్లింది..ఆ తర్వాత వరుసగా బజరంగీభాయ్ జాన్, పీకె, ధూమ్3 ఉన్నాయి. అయితే ఇప్పుడు వస్తున్న బాహుబలి రెండో భాగం ఈ రికార్డ్ ని తిరగరాసే అవకాసాలూ లేకపోలేదు. ఎందుకంటే బాహుబలి అన్ని ప్రాంతీయ భాషలలోనూ డబ్ చేయబడి అన్ని ప్రాంతాలలోనూ విదుదలయ్యింది. కానీ సుల్తాన్ అలా కాదు ఒకే భాష లోనే వచ్చినా బాహుబలిని బీట్ చేసేసింది.

English summary
Bollywood hero Salman khan's Sultan Movie crossed Telugu Director rajamauli's sensational Movie Bahubali in first week collections.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu