»   » ట్యూబ్‌లైట్‌తో రికార్డులు బద్దలు.. సల్మాన్ సునామీ ఖాయమట.. ఇండియా, చైనా యుద్ధమంటే మజాకా!

ట్యూబ్‌లైట్‌తో రికార్డులు బద్దలు.. సల్మాన్ సునామీ ఖాయమట.. ఇండియా, చైనా యుద్ధమంటే మజాకా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ట్యూబ్‌లైట్‌తో రికార్డులు బద్దలు.. సల్మాన్ సునామీ ఖాయమట.. ఇండియా, చైనా యుద్ధమంటే మజాకా!

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మరో సంచలన విజయాన్ని చేజిక్కించుకొనేందుకు సిద్ధమవుతున్నారు. భారత, చైనా యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ప్రేమ కథా చిత్రం ట్యూబ్‌లైట్ ద్వారా కేవలం కలెక్షన్లే కొల్లగొట్టడం కాకుండా ప్రేక్షకుల మనసులను దోచుకోవడం ఖాయమనే మాట బలంగా వినిపిస్తున్నది. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జూన్ 23న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది.

భారత్, చైనా యుద్ధం కథగా..

భారత్, చైనా యుద్ధం కథగా..

ట్యూబ్‌లైట్ చిత్రం కోసం సల్మాన్, దర్శకుడు కబీర్ ఖాన్ మూడోసారి జతకట్టారు. గతంలో ఏక్ థా టైగర్, భజరంగీ భాయ్‌జాన్ చిత్రాల్లాంటి సూపర్ హిట్లను అందించారు. మూడోసారి కూడా యుద్ధ నేపథ్యమున్న విలక్షణ కథతో ముందుకు వస్తున్నారు. ప్రతీసారి రంజాన్ పండుగకు ప్రేక్షకులకు అలరించే సల్మాన్ ఈసారి కూడా అదే బాటను ఎంచుకొన్నారు. ఈ చిత్రంలో సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్, దివంగత నటుడు ఓం పురి, చైనా నటి జూ జూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

మూడు రోజుల ముందే పండుగ

మూడు రోజుల ముందే పండుగ

ఈ ఏడాది సల్మాన్ అభిమానులకు మూడు రోజుల ముందే రంజాన్ పండుగ వస్తున్నది. సల్లూభాయ్ నటిస్తున్న ట్యూబ్‌లైట్ చిత్రం జూన్ 23న విడుదలకు రెడీ అవుతున్నది. ప్రేక్షకులకు ఇది పండుగ లాంటి వార్త అని ట్రేడ్ అనలిస్టు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

ఆర్మీ జవానుగా సల్మాన్

ఆర్మీ జవానుగా సల్మాన్

లడఖ్, మనాలి, ఇతర దేశ సరిహద్దు ప్రాంతాల్లో నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్న ట్యూబ్‌లైట్ చిత్రం మార్చిలో షూటింగ్ పూర్తి చేసుకొన్నది. ఈ చిత్రంలో సల్మాన్ ఆర్మీ జవానుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ రైట్స్ రూ.20 కోట్లకు అమ్ముడు పోవడం బాలీవుడ్‌లో రికార్డు. ఈ హక్కులను సోని మ్యూజిక్ దక్కించుకొన్నది. ఇందులో మరో విశేషమేమిటంటే ఈ ఆడియోలో కేవలం మూడే పాటలు ఉండటం గమనార్హం.

 సుల్తాన్ రిపీట్

సుల్తాన్ రిపీట్

ట్యూబ్‌లైట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరుగరాసే అవకాశం ఉంది అని ట్రేడ్ అనలిస్టులు ఇప్పటికే విశ్లేషణలు మొదలుపెట్టారు. ఈ చిత్రానికి ముందు సుల్తాన్ సినిమా కలెక్షన్ల రికార్డులను కొల్లగొట్టింది. సుల్తాన్ రిలీజ్ అనంతరం దాదాపు ఏడాది తర్వాత సల్మాన్ సినిమా విడుదలవుతున్నది. సాధారణంగా తొలివారంతంలో మూడు రోజులు సల్మాన్‌కు భారీ ఓపెనింగ్స్ ఉంటాయి.

లాంగ్ వీకెండ్.. కలెక్షన్లు..

లాంగ్ వీకెండ్.. కలెక్షన్లు..

అయితే ఈ సారి రంజాన్ సోమవారం అంటే జూన్ 26న విడుదల అవుతున్నది. అంటే ఈ సినిమాకు నాలుగు రోజుల వీకెండ్ ఉంటుంది. దాంతో ప్రేక్షకుల తాకిడి ఈ చిత్రానికి ఎక్కువగానే ఉండే అవకాశముందనే చెప్తున్నారు. ప్రతీ ఏడాది ముస్లింలకు ఈద్ వేడుకను దాదాపు వారం రోజులపాటు జరుపుకొంటారు. ఈ వారం రోజుల్లో వారు సల్మాన్ సినిమాను ఆదరించే అవకాశం ఎక్కువగానే ఉన్నాయి.

రికార్డు స్థాయిలో థియేటర్లు..

రికార్డు స్థాయిలో థియేటర్లు..

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కేవలం వారం రోజులే కాకుండా దాదాపు పది రోజులపాటు ట్యూబ్‌లైట్ కుమ్మేసే అవకాశముంది. అంతేకాకుండా థియేటర్ల సంఖ్య, టికెట్ ధర పెంపు అంశాలు కూడా కలెక్షన్లు రికార్డు స్థాయిలో ఉండటానికి అవకాశం ఉంది.

భావోద్వేగమైన కథ..

భావోద్వేగమైన కథ..

ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య కథతో వచ్చిన భజ్‌రంగీ భాయ్‌జాన్ చిత్రం రికార్డులను తిరుగరాసింది. అలాంటి భావోద్వేగమైన కథతో వస్తున్న ట్యూబ్‌లైట్ చిత్రం తప్పకుండా రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమని విశ్లేషకులు చెప్తున్నారు.

అతిథి పాత్రలో షారుక్

అతిథి పాత్రలో షారుక్

భారత్‌కు చెందిన ఓ యువకుడు, చైనాకు చెందిన యువతి ప్రేమలో పడుతారు. భారత, చైనా యుద్దంలో వారు ఎలాంటి పరిస్థుతులను ఎదుర్కొన్నారనే కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ అతిథి పాత్రను పోషిస్తున్నట్టు డైరెక్టర్ కబీర్ ఖాన్ వెల్లడించారు.

English summary
The rumoured Indo China war backdrop and the presence of Chinese actress Zhu Zhu has already led to a lot of speculation and expectations from the film. A humongously positive word of mouth for Bajrangi Bhaijaan resulted in the film scoring more footfalls in the cinema halls than even PK. It remains to be seen if Tubelight lives up to the hype and scores at the box office as well as the hearts.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu