»   »  నా కూతురు ఆ హీరోకు జోడీగా సూపర్ : అనిల్ కపూర్

నా కూతురు ఆ హీరోకు జోడీగా సూపర్ : అనిల్ కపూర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అనిల్ కపూర్ ఒకప్పుడు బాలీవుడ్ స్టార్‌గా ఓ వెలుగు వెలిగాడు. ఆయన వారసత్వం పునికి పుచ్చుకుని సినిమా రంగంలోకి అడుగు పెట్టిన సోనమ్ కపూర్ కూడా హీరోయిన్ గా తన సత్తా చాటుతోంది. త్వరలో సోనమ్ కపూర్ నటించిన ‘ప్రేమ్ రతన్ ధ్యాన్ పాయో' సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమాలో ఆమె బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు జోడీగా నటిస్తోంది.

ఈ నేపథ్యంలో అనిల్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. సల్మాన్ కు జోడీగా తన కూతురు సోనమ్ నటించడం చాలా ఆనందంగా ఉందని, ఈ క్షణాల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. గతంలో సోనమ్ నటించిన సావరియా చిత్రంలో సల్మాన్ నటించినా ఇద్దరూ జోడీగా నటించలేదన్న ఆయన...ఇద్దరూ ఎంతో అందంగా ఉంటారు. జోడీగా నటిస్తే మరింత అద్భుతంగా కనిపిస్తారు, అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారు అంటూ అనిల్ కపూర్ వ్యాఖ్యానించారు.

Salman Khan

‘ప్రేమ్ రతన్ ధ్యాన్ పాయో' సినిమాకు సూరజ్ బర్‌జాత్యా దర్శకత్వం వహిస్తున్నారు. రాజశ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రంలో సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్ తో పాటు నీల్ నితిన్ ముఖేష్, అనుపమ్ ఖేర్, దీపక్ దోబ్రియల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హిమేష్ రేషమియా సంగీతం అందిస్తున్నారు.

ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సల్మాన్ ఖాన్ డబల్ రోల్ చేస్తున్నారు. ప్రేమ్ అనే రాజకుమారుడి పాత్రలో, విజయ్ అనే ఫైటర్ పాత్రలో నటిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నవంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
"Salman Khan and Sonam look great together" Anil Kapoor said.
Please Wait while comments are loading...