»   » సల్మాన్ ఖాన్... మొన్న తెలుగు, ఇప్పుడు మళయాళం

సల్మాన్ ఖాన్... మొన్న తెలుగు, ఇప్పుడు మళయాళం

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొన్న తెలుగు రీమేక్ 'పోకిరి' లో నటించిన సల్మాన్ ఖాన్ ఈ సారి మళయాళ రీమేక్ కి కమిటయ్యారు. మళయాళంలో వచ్చి హిట్టయిన 'బాడీగార్డ్‌' సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారు. సల్మాన్‌ ఖాన్‌ బంధువు అతుల్‌ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. తొలుత ఈ సినిమా హక్కుల్ని బోనీ కపూర్‌ తీసుకోవాలనుకున్నారు. కానీ సల్మాన్‌ కూడా ఆసక్తిగా ఉన్నారని తెలిసి ఆయన వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. ఇక దర్శకుడిగా మలయాళంలో చిత్రాన్ని తెరకెక్కించిన సిద్ధిఖ్‌నే దర్శకుడిగా ఎంచుకున్నారు.

ఈ విషయమై అతుల్ మాట్లాడుతూ...నేను మరో వారంలోనే హీరోయిన్ ఎవరన్నది కన్ఫర్మ్ చేసేస్తాను. షూటింగ్ పనులు సాధ్యమైనంత తొందరలోనే మొదలెడతాను. ఇక బోనీ కపూర్ ఈ ప్రాజెక్టుపై ఆసక్తి కనపరిచారని నాకు తెలియదు. సల్మాన్ మాత్రం నేను నిర్మించటంపై చాలా ఆనందం వ్యక్తం చేసాడు. సిద్దిక్ ని డైరక్టర్ తీసుకోవటం పై వేరే ఆలోచనలేదు. సబ్జెక్టు పై స్పష్టత ఉంటుందని మాత్రమే ఆ నిర్ణయం తీసుకున్నాం అన్నారు.

ఇక ప్రభుదేవాతో మరో చిత్రం చేస్తానన్న సల్మాన్ ఆ ప్రాజెక్టుని విరమించుకున్నారు. అలాగే సల్మాన్ ఖాన్ దక్షిణాది కథలనే ఎంచుకోవటంపై బాలీవుడ్ లో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే సల్మాన్ ఖాన్ మాత్రం తనకూ, తన అభిమానులకు నచ్చే కథ ఎక్కడున్నా పట్టుకుంటానంటున్నాడు. ఇక ఈ చిత్రాన్ని తమిళంలో విజయ్, అసిన్ లతో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu