»   » సల్మాన్ సుల్తాన్ టైటిల్ ట్రాక్ : సింప్లీ అమేజింగ్

సల్మాన్ సుల్తాన్ టైటిల్ ట్రాక్ : సింప్లీ అమేజింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ సుల్తాన్. అలీ అబ్బాస్ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్, అనుష్కాశర్మ నటించిన సుల్తాన్ లో సల్మాన్ ఖాన్ రియల్ లైఫ్ క్యారెక్టర్‌లో జీవించబోతున్నాడు. ఒక మల్ల యోధుడి జీవితాన్ని తెర మీద ఆవిష్కరించబోతున్నాడు.

ఆల్రెడీ రిలీజ్ అయిన "సుల్తాన్" టీజర్‌కి అన్ని వైపుల నుంచి ప్రశంశలే వచ్చాయి. అందులో సల్మాన్ చూపించిన ఇంటెన్స్ ఎమోషన్స్‌కి ఓ రేంజ్‌లో అభినందనలు దక్కుతున్నాయి. సినిమా కూడా బాగా వచ్చిందని చెప్తున్నారు. సల్మాన్ పర్సనాలిటీ కూడా సుల్తాన్‌ క్యారెక్టర్‌ పర్ఫెక్ట్‌గా యాప్ట్ అయింది. సో....సల్మాన్ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ ఈ ఈద్‌కి సల్మాన్ ఖాన్ స్పెషల్ ట్రీట్‌కి ప్రిపేర్ అయిపోవచ్చు.

Salman Khan-starrer Sultan's title track finally out

ఒక్క కట్ కూడా లేకుండా యు ఎ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్. సాధారణంగా సల్మాన్ చిత్రాలు ఇంటిల్లిపాదీ చూసే విధంగానే ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అదే విషయాన్ని సెన్సార్ అధికారులు కూడా చెప్పినట్టు తెలుస్తోంది. అయితే రెజ్లింగ్ లో అంతర్లీనంగా వయోలెంట్ స్పిరిట్ ఉంటుంది కాబట్టి యు ఎ ఇవ్వవలసి వచ్చిందని కూడా సెన్సార్ అధికారులు వివరణ ఇచ్చారట...

విడుదలకు దగ్గరవుతున్న కొద్దీ ప్రమోషన్లో భాగంగా సినిమాలోని ఒక్కో పాటను విడుదల చేస్తున్నారు. తాజాగా సుల్తాన్ టైటిల్ సాంగ్ వీడియోను విడుదల చేశారు. " మైనే పహల్వానీ జరూర్ ఛోడీ హై.., పర్ లడ్ నా నహీ భూలా" (నేను పహిల్వాన్ (రెజ్లింగ్) ఆటను వదిలేసాను.., కానీ పోరాడతం మర్చిపోలేదు) అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది.

ఓ వయసు పెరిగిన రెజ్లర్ తనలో ఇంకా సత్తా ఉంది.. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే ఇతివృత్తానికి ప్రేమకథ జోడించి దర్శకుడు అబ్బాస్ అలీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. . యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ఈద్ కానుకగా జూలై 6న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

English summary
After much waiting, and even two days of trending on Twitter, superstar the Salman Khan and Anushka Sharma-starrer Sultan’s title track is out.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu