»   »  'హీరో' ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసిన సల్మాన్ (ఫొటో)

'హీరో' ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసిన సల్మాన్ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: బాలీవుడ్‌ తాజా చిత్రం 'హీరో' ఫస్ట్‌ లుక్‌ని నేడు విడుదల చేశారు. ఈ చిత్రం 1983లో జాకీ ష్రాఫ్‌, మీనాక్షి శేషాద్రి జంటగా నటించిన హీరో చిత్రానికి రీమేక్‌ అని చిత్ర దర్శకుడు నిఖిల్‌ అద్వానీ తెలిపారు. ఈ చిత్రం లో హీరో ఫస్ట్ లుక్ ని సల్మాన్ తన ట్వీట్ ద్వారా విడుదల చేసారు. 

బాలీవుడ్‌ స్టార్ హీరో,కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా సుభాష్‌ ఘయ్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా ఇద్దరు వారసులు వెండితెర అరంగేట్రం చేస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆదిత్య పంచోలీ కుమారుడు సూరజ్‌ పంచోలీ, సునీల్‌ శెట్టి కూతురు అథియా శెట్టి కలిసి నటించిన ఈ చిత్రం సెప్టెంబరు 25న విడుదల కానుంది. అథియా శెట్టి, సూరజ్ పంచోలి త్వరలో వెండి తెర తెరంగ్రేటం చేయబోతున్న నేపథ్యంలో ‘ఫిల్మ్ ఫేర్' మేగజైన్ కవర్ పేజీపై ది హాట్ బ్లడెడ్ అఫైర్ పేరుతో హాట్ ఫోజులు ఇచ్చారు.

Salman Khan unveiled ‘Hero’ first look

హీరో' టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ స్వయంగా సల్మాన్ ఖాన్ నిర్మింస్తుండటం గమనార్హం. జియా ఖాన్ ప్రియుడైన సూరజ్ పంచోలి ఆ మధ్య ఆమె అనుమానాస్పద మృతిలో వివిధ ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నిఖిల్ అద్వాని దర్శకత్వం వహిస్తున్నారు.

సుభాష్ గయ్ దర్శకత్వంలో 1983లో వచ్చిన ‘హీరో' చిత్రానికి ఇది రీమేక్. ప్రస్తుతం ఈ చిత్ర పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. ఇందులో గోవింద, అనిత హాసనందిని, వినోద్ ఖన్నా, ఖాదర్ ఖాన్ నటిస్తున్నారు.

English summary
Salman Khan tweeted, "Back off, HERO coming on 4th September HeroTheFilm." Hero remake will also mark the launch of the Salman’s production house ‘Salman Khan Productions.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu