»   » సల్మాన్ ట్వీట్ చేసిన ఫస్ట్‌లుక్.. సోషల్ మీడియాలో బంపర్ హిట్.. సైరత్ తర్వాత..

సల్మాన్ ట్వీట్ చేసిన ఫస్ట్‌లుక్.. సోషల్ మీడియాలో బంపర్ హిట్.. సైరత్ తర్వాత..

Posted By:
Subscribe to Filmibeat Telugu

మరాఠీ చిత్రం సైరత్‌తో బ్లాక్ బస్టర్ అందుకొన్న ఆకాశ్ తోసర్ తదుపరి చిత్రం ఎఫ్‌యూ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశాడు. ఈ చిత్రానికి తన అత్యంత సన్నిహితుడు, మిత్రుడు దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. సైరత్ లాంటి ఘన విజయం తర్వాత ఆ చిత్ర హీరో ఆకాశ్ నటించిన తదుపరి చిత్రం ఎఫ్‌యూ కావడం విశేషం. ఆకాశ్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

వంద కోట్లకు పైగా

గత ఏడాది చిన్న చిత్రంగా విడుదలైన సైరత్ బాలీవుడ్ ప్రముఖులను ఆశ్చర్యపరిచేంత హిట్‌ను సాధించిన సంగతి తెలిసిందే. నాగరాజ్ మంజులే దర్వకత్వం వహించిన చిత్రంలో ఆకాశ్ తోసర్, రింకూ రాజ్ గురు జంటగా నటించారు. సుమారు రూ.40 లక్షలతో రూపొందిన ఈ చిత్రం దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

సైరత్ తర్వాత ఎఫ్‌యూలో

సైరత్ తర్వాత ఎఫ్‌యూలో

సైరత్ చిత్రం అనంతరం ఆకాశ్ నటిస్తున్న చిత్రం ఎఫ్‌యూ. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రానికి సల్మాన్ మిత్రుడు, రచయిత, నటుడు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహించారు. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

జూన్ 2వ తేదీన విడుదల

జూన్ 2వ తేదీన విడుదల

సైరత్ చిత్రంలో నటించిన ఆకాశ్ తోసర్ మళ్లీ ఎఫ్‌యూ అనే చిత్రంతో వస్తున్నాడు. ఈ చిత్రానికి మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఇది అనే సందేశంతో సల్మాన్ ఓ ఫొటోను పెట్టి ట్వీట్ చేశారు. సల్మాన్ షేర్ చేసిన ఫొటో గతంలో రజనీకాంత్ నటించిన బాబా చిత్రానికి సంబంధించిన స్టిల్‌ను పోలి ఉంది. ఈ చిత్రం జూన్ 2 తేదీన విడుదలకు సిద్ధమవుతున్నది.

నేటితరం యువత చిత్రం

నేటితరం యువత చిత్రం

సైరత్ చిత్రం యువ జంట ప్రేమ కథ కాగా, ఎఫ్‌యూ చిత్రం నేటితరం యువతకు సంబంధించిన చిత్రం. ఈ చిత్రంపైనా కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. కొద్ద సంవత్సరాలుగా నటనకే పరిమితమైన మహేశ్ మంజేక్రర్ తాజాగా ఈ చిత్రంతో మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. గతంలో సంజయ్ దత్‌తో వాస్తవ్ చిత్రానికి, మరాఠీ చిత్రం నటసమ్రాట్ సినిమాకు, మరో ద్విభాషా చిత్రం సిటీ ఆఫ్ గోల్డ్ చిత్రానికి మహేశ్ దర్శకత్వం వహించారు.

English summary
Salman Khan took to Twitter to share the first look of FU, directed by Mahesh Manjrekar and starring Aakash Thosar of Sairat fame. Aakash Thosar will be seen in a new film titled FU directed by noted Marathi writer, actor, director and producer Mahesh Manjrekar. Mahesh's close friend and co-actor in several films, Salman Khan, took to Twitter to share the first look of FU.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu