»   » కేసులు, ఎఫైర్లు, వివాదాలు: బాలీవుడ్ బ్యాడ్ బాయ్ సల్మాన్

కేసులు, ఎఫైర్లు, వివాదాలు: బాలీవుడ్ బ్యాడ్ బాయ్ సల్మాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఒకరి ప్రాణాలు బలిగొని, నలుగురిని గాయ పరిచిన హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను ముంబై సెషన్స్ కోర్టు దేషిగా తేల్చింది. కారు నడిపే సమయంలో సల్మాన్ ఖాన్ మద్యం సేవించి ఉన్నాడని కోర్టు స్పష్టం చేసింది. ఆ సమయంలో తాను కారు నడపలేదని, డ్రైవర్ నడిపాడనే సల్మాన్ వాదనను కోర్టు కట్టు కథగా పేర్కొంది. ఆ సమయంలో సల్మాన్ కు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని తేల్చింది. సల్మాన్ ఖాన్ మీద ఉన్న 8 అభియోగాలు నిరూపణ కావడంతో కోర్టు అతన్ని దోషిగా ప్రకటించింది. మరి అతనికి కోర్టు ఉన్నేల్ల శిక్ష వేస్తుందనేది చర్చనీయాంశం అయింది. అతనికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే సల్మాన్ ఖాన్ సామాజిక సేవాకార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని శిక్ష రెండేళ్లకు మించి వేయరాదని ఆయన తరుపు లాయర్ కోర్టుకు విన్నవించారు.

కాగా.... సల్మాన్ ఖాన్ జీవితంలో ఇదొక్కటే కాదు అనేక వివాదాలు ఉన్నాయి. కెరీర్ మొదటి నుండి ఆయన వివాదాస్పదుడిగానే పేరు పొందాడు. పలు కేసులు, హీరోయిన్లతో ఎఫైర్లు, ఇతర స్టార్లతో వివాదాలు ఇలా ఎప్పుడూ ఏదో ఒక వార్తతో సల్మాన్ ఖాన్ వార్తల్లో ఉండే వాడు.

హిట్ అండ్ రన్ కేసు...
2002 సెప్టెంబర్ 28న అర్ధరాత్రి ముంబైలో ఓ హోటల్ నుంచి మద్యం తాగిన సల్మాన్ కారు నడుపుకుంటూ వచ్చి రోడ్డుపై నిద్రిస్తున్నవారిపైకి ఆ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా నలుగురు గాయపడ్డారు. పదమూడేళ్ల పాటు సాగిన ఈ కేసులో ఈ రోజు ముంబై సెషన్స్ కోర్టు అతన్ని దోషిగా తేల్చింది. ఈ కేసులో శిక్ష నుండి తప్పించుకోవడానికి సల్మాన్ చాలా ప్రయత్నాలు చేసారు. తన డ్రైవరే కారు నడిపాడని కోర్టు నమ్మించే ప్రయత్నం చేసాడు. అయితే కోర్టు అతని వాదనలను కట్టుకథలుగా పేర్కొంది. కోర్టు తీర్పు అనంతరం సల్మాన్ ఖాన్ కంటతడి పెట్టారు.

 Salman Khan was Bollywood's bad boy

కృష్ణ జింకల వేట కేసు...
ఫిబ్రవరి, 2006లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ దోషిగా తేలాడు. 1998లో సెప్టెంబర్ లో హమ్ సాత్ సాత్ హై షూటింగులో జింకలను వేటాడటంతో అటవీ చట్టాల ప్రకారం అతన్ని తేషిగా తేల్చారు. ఈ కేసులో సల్మాన్ ఖాన్ సంవత్సరం జైలు శిక్షతో పాటు, రూ. 5000 జరిమానా కట్టాడు.

లవ్ ఎఫైర్లు...
సల్మాన్ ఖాన్ తన కెరీర్లో నలుగురు నటీనటులతో లవ్ ఎఫైర్లు నడిపినట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అదే సమయంలో వీరితో గొడవలు పడ్డట్లు కూడా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. సల్మాన్ ఖాన్ తొలుత నటి సంగీత బిజిలానితో ప్రేమాయణం నడిపాడు. కొంతకాలం తర్వాత ఇద్దరూ విడిపోయారు. అనంతరం సంగీత క్రికెటర్ అజారుద్దీన్ ను పెళ్లాడింది.

1993లో యూఎస్ నుండి ముంబై వచ్చిన మోడల్ సోమితో సల్మాన్ ఖాన్ క్లోజ్ అయ్యాడు. అతని సహాయంతో ఆమె అంత్(1993) సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది. అయితే ఇద్దరూ 1998లో విడిపోయారు. సల్మాన్ ఖాన్ అతిగా తాగి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

సల్మాన్ ఖాన్-ఐశ్వర్యరాయ్ ప్రేమాయణం అప్పట్లో ఓ సెన్నేషన్. 1999లో వీరు హమ్ దిల్ దే చుక్కె సనమ్ చిత్రంలో కలిసి నటించిన వీరు చాలా క్లోజ్ అయ్యారు. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. అయితే 2002లో వీరి లవ్ లైప్ ముగిసింది. సల్మాన్ ఖాన్ తనను వేధిస్తున్నాడని ఐశ్వర్యరాయ్ ఆరోపించింది.

సల్మాన్ ఖాన్ జీవితంలోకి 2003లో కత్రినా కైఫ్ ప్రవేశించింది. సల్మాన్ ఖాన్ సహాయంతో ఆమె బాలీవుడ్లో హీరోయిన్ గా ఎదిగింది. అయితే వీరి ప్రేమ బంధం ఎక్కువ కాలం సాగలేదు. సల్మాన్ ఖాన్ బిహేవియర్ భరించలేకే ఆమె అతనితో విడిపోయిందనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ప్రస్తుతం ఇద్దరూ స్నేహితులుగా కొనసాగుతున్నారు.

షారుక్ తో గొడవ...
కత్రినా కైఫ్ పుట్టినరోజు వేడుకలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ 2008 గొడవ పడ్డారు. చాలా కాలం పాటు ఇద్దరూ మాట్లాడుకోలేదు. అయితే రెండేళ్ల క్రితం మళ్లీ ఇద్దరూ ఒకటయ్యారు.

వివేక్ ఒబెరాయ్...
సల్మాన్ ఖాన్ తన మాజీ గర్ల్ ఫ్రెండ్ ఐశ్వర్యరాయ్ కి వివేక్ ఒబెరాయ్ క్లోజ్ గా ఉండటంతో తట్టుకోలేక పోయాడు. సల్మాన్ తనను వేధిస్తున్నాడని, చంపుతానని బెదిరిస్తున్నాడని వివేక్ ఒబెరాయ్ ఆరోపించారు.

వివాదాస్పద వ్యాఖ్యలు...
26/11 ముంబై దాడుల సల్మాన్ ఖాన్ వివాదాస్సద వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పారు. ‘ఈ దాడుల వెనక గవర్నమెంట్(పాకిస్థాన్) లేదు ఇది టెర్రరిస్టుల దాడి' అని సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయింది.

ముస్లిం ఆర్గనైజేషన్లు సల్మాన్ ఖాన్ కు రెండు సార్లు ఫత్వా జారీ చేసాయి. గణేష్ పూజకు హాజరైన సందర్భంలో ఒకసారి, మేడమ్ టుస్సాడ్స్ లండన్లో తన మైనపు విగ్రహం విషయంలో మరోసారి ఫత్వా జారీ అయింది.

English summary
Salman Khan hit-and run case verdict has been a big blow for the actor and his family. The actor has been found guilty.The sessions court judge DW Deshpande told Salman Khan, "you were driving the car" and held him guilty of all eight charges against him in the case.
Please Wait while comments are loading...