»   » ఎవరినీ ఆ పని చేయటానికి ఒప్పుకోనంటున్నాడు సల్మాన్

ఎవరినీ ఆ పని చేయటానికి ఒప్పుకోనంటున్నాడు సల్మాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్‌లో కొంతకాలంగా బయోపిక్‌ల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా సల్మాన్ ఖాన్ సైతం ... సుల్తాన్ అంటూ మల్లయోధుడు కథతో ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. అయితే సల్మాన్ ఖాన్ జీవిత చరిత్ర ని తెరకెక్కిస్తే ఎలా ఉంటుంది. ఐడియా వరకూ బాగానే ఉంది కానీ సల్మాన్ మాత్రం ససిమేరా ఒప్పుకోనంటున్నాడు.

సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ...''నా జీవిత కథ చాలా విసుగు తెప్పిస్తుంది. బోర్‌గా ఉంటుంది. అలాంటి కథతో సినిమాలు కూడా తెరకెక్కించలేరు. ఒకవేళ ఎవరైనా దర్శకుడు ముందుకొచ్చినా ఆ అవకాశం ఎవ్వరికీ ఇవ్వను. ఎందుకంటే నాతో సహా నా చెల్లెల్లు.. తమ్ముళ్లు.. సన్నిహితులని అడిగినా నా గురించి అన్ని అంశాలు చెప్పలేరు. అందరికీ అన్నీ గుర్తు ఉండవు కదా!'' అని అన్నాడు. మరో ప్రక్క వెండితెరపై తన పాత్రను ఎవ్వరూ పోషించలేరని చెబుతున్న సల్లూభాయ్‌.. సంజయ్‌దత్‌ బయోపిక్‌లో తన పాత్ర లేకుండా పూర్తి కాదని చెప్పుకొచ్చాడు.

Salman Khan will never allow anyone to make a biopic on him!

అలాగే బాలీవుడ్‌లో మరో హీరో వరుణ్‌ ధావన్‌ సైతం బయోపిక్‌లంటే అంతగా నచ్చవుఅంటున్నాడు. తాజాగా వరుణ్‌ లెజెండరీ హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్‌ బయోపిక్‌లో నటిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. నిర్మాతలు పూజా శెట్టి, ఆర్తి శెట్టి, దర్శకుడు కరణ్‌ జోహార్‌లు ఈ సినిమా కోసం వరుణ్‌ని ఎంపికచేసుకోనున్నారని పుకార్లు వినిపించాయి.

అయితే ఈ విషయమై వరుణ్‌ స్పందిస్తూ ఇప్పటివరకు తనకు ఎలాంటి బయోపిక్‌లో నటించే అవకాశాలు రాలేదని ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌ బయోపిక్‌లదే అని తెలుసుకానీ ఎందుకో తనకు బయోపిక్‌లంటే అంత ఆసక్తి ఉండదని మంచి కథ ఉంటే చేస్తాను కానీ ఇప్పటికైతే చేస్తున్న సినిమాలే సంతృప్తినిస్తున్నాయని వరుణ్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాల గురించి మాట్లాడుతూ..'నేను చేసే ప్రతి సినిమా నాకు బయోపిక్‌ లాంటిదే. ప్రతి పాత్రనీ అంతే ప్రాధాన్యంతో చేస్తాను. అంతెందుకు.. ఇప్పుడు నేను బద్రీనాథ్‌కి దుల్హనియా సినిమాలో నటిస్తున్నాను. ఇందులో ఝాన్సీ ప్రాంతం నుంచి వచ్చిన ఓ అబ్బాయిలా నటిస్తున్నాను. డిషూం సినిమాలో జునైద్‌ అన్సారీ అనే పోలీసు పాత్రలో నటిస్తున్నాను' అని వివరించాడు వరుణ్‌.

English summary
Salman Khan thinks his life is not interesting to be made into a film. On being asked about it, Salman, 50, said, "See, my life is very boring aur boring life par koi biopic banti nahin hai. Meri biopic ke andar bahut sare log mar jaayenge yaar," during a press meet of Sultan success.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu