»   » అభిమానుల కోసం ఏడేళ్ళుగా నరకం చూస్తున్నా., తన సూసైడ్ డిసీజ్ సంగతి చెప్పిన సల్మాన్

అభిమానుల కోసం ఏడేళ్ళుగా నరకం చూస్తున్నా., తన సూసైడ్ డిసీజ్ సంగతి చెప్పిన సల్మాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సల్మాన్ ఖాన్ ఒక పక్క బాలీవుడ్ బ్యాడ్ బాయ్ అనిపించుకుంటూనే మరో పక్క బీయింగ్ హ్యూమన్ అంటూ తనలో ఉండే మానవత్వం తో ఆకట్టు కుంటాడు. 50 కి దగ్గర పడ్దా ఇప్పటికీ తను యూత్ లానే కనిపిస్తాడు. దేశం లోనే తన సిక్స్ ప్యాక్ బాడీ తో షర్ట్ విప్పే సాంప్రదాయానికి తెరలేపిన మాచో హీరో. మిడ్ లైఫ్ వయసు దాట్టిన సల్మాన్ ఎప్పుడు ఫిట్ గా కనిపిస్తాడు. ఈ వయసులో కూడా అలా బాడీని కాపాడుకోవడం చాలా కష్టం కాని.. ఈ విషయం లో సల్మాన్ కు పోటీ వచ్చే హీరో లేడనే చెప్పాలి. కాకపోతే ఇంతటి బలుడు కూడా బయటకు కనిపించని భయంకర రోగంతో పోరాడుతున్నాడు.

మాయదారి రోగంతో

మాయదారి రోగంతో

తను ఓ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు సల్మాన్‌ స్వయంగా చెప్పాడు. అది నరాలకు అస్వస్థతకు సంబంధించిన సమస్య అనీ, ఏ మాత్రం తేడా చేసినా తలలో నరాలు ఉబ్బి తీవ్రమైన తలనొప్పి వస్తుందని తెలిపాడు. ఈ మాయదారి రోగంతో సినిమాలు చేయడం కష్టం అనిపించినా, అభిమానులు చూపించే అభిమానం ముందు ఈ సమస్య చిన్నగా అనిపించి మౌనంగానే ఆ బాధను అనుభవిస్తున్నాని అన్నాడు.

తలలో నరాలు ఒక్కసారిగా ఉబ్బి

తలలో నరాలు ఒక్కసారిగా ఉబ్బి

ఏడున్నరేళ్లుగా ట్రై జెమినల్ న్యూరాల్జియా రోగంతో బాధపడుతున్నాడు సల్మాన్ ఖాన్. ఇది నరాల అస్తవ్యస్థతకు సంబంధించిన రోగం. ఇన్నాళ్ళూ దీన్ని సీక్రేట్ గానే ఉంచినా ఇప్పుడు బయట పెట్టాడు . తన కొత్త సినిమా ట్యూబ్ లైట్ ప్రమోషన్లో భాగంగా దుబాయ్ వెళ్లిన సల్మాన్ అక్కడ ఈ విషయాల్ని మీడియా ముందు ఉంచాడు.

సూసైడ్ డిసీజ్

సూసైడ్ డిసీజ్

తలనొప్పి ఎంత భాదపెడుతున్నా కూడా అభిమానుల్ని అలాగే నన్ను నమ్ముకున్న కుటంబాలను తలుచుకొని సినిమాలు చేస్తుంటానని చాలా ఎమోషనల్ గా చెప్పాడు. ఈ మహమ్మారి ట్రీట్ మెంట్ కోసం ఓసారి అమెరికా కూడా వెళ్లొచ్చాడట. దాదాపు 8 నెలల పాటు అక్కడే హాస్పిటల్ లోనే ఉండాల్సి వస్తుందని డాక్టర్లు చెప్పడంతో ట్రీట్ మెంట్ను వాయిదా వేశాడని తెలుస్తోంది. ఈ డిసీజ్ ఎంత భయంకరమైన భాద ఇస్తుందో ఒక్క ముక్కలో చెప్పాలంటే దీన్ని వైధ్యులు సూసైడ్ డిసీజ్ గా వ్యవహరిస్తూంటారు.

ఎనిమిది నెలలు హాస్పిటల్‌లో

ఎనిమిది నెలలు హాస్పిటల్‌లో

ఈ నొప్పి నివారణకు ఆపరేషన్‌ ఒక్కటే మార్గమని అమెరికా డాక్టర్లు చెప్పారనీ, కాకపోతే ఎనిమిది నెలలు హాస్పిటల్‌లో ఉండాల్సి వస్తుందని అన్నారనీ, ప్రస్తుత పరిస్థితిలో అంత కాలం ఆసుపత్రిలో ఉండడం కుదరదు కనుక ఆపరేషన్ని వాయిదా వేసుకున్నానని వివరించాడు.

English summary
“I am suffering from trigeminal neuralgia, a facial nerve problem I have had since the last seven years. But now, it’s getting worse. Ab dard hadd se paar ho gaya hai and I am going to kill it,” says the 45-year-old, who had to undergo an angiography
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu