»   » రాజమౌళీ హీరోయిన్ కెరీర్ ఊపందుకుంటోంది..!

రాజమౌళీ హీరోయిన్ కెరీర్ ఊపందుకుంటోంది..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో ఇటీవల వచ్చిన 'వీర' సినిమా ఫ్లాప్ కావడంతో హీరో రవితేజ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకొనే లేదు. అయితే, ఆ సినిమా దర్శకుడు రమేష్ వర్మ మాత్రం దానిని లైట్ తీసుకుని, తన తదుపరి చిత్రానికి అప్పుడే ఓపక్క సన్నాహాలు చేసేసుకుంటున్నాడు. స్క్రిప్టును కూడా రెడీ చేసుకున్నాడట. ఇప్పటికే 'పల్లకిలో పెళ్ళి కూతురు", 'వారెవా" రెండు సినిమాలలో హీరోగా చేసినా... ఇంకా కెరీర్ ఏమాత్రం గాడిలో పడని హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్ ఇందులో కథానాయకుడుగా నటిస్తాడు.

రాజమౌళి దర్శకత్వంలో మర్యాదరామన్న సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకులకు మరింత దగ్గరైన సలోనీని తాజాగా గౌతమ్ సినిమాకి ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. గతంలో రమేష్ వర్మ రూపొందించిన 'ఒక ఊరిలో...' సినిమాలో సలోనీ కథానాయికగా నటించింది. ప్రస్తుతం తను 'తెలుగమ్మాయి' సినిమాతో బాటు బాలకృష్ణ, వెంకటేష్ నటిస్తున్న సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే..!

English summary
Saloni, who has made her comeback with Rajamouli’s directorial Maryada Ramanna seems to be grabbing every big chance that comes her way. Post Maryada Ramanna, Saloni has taken up only a single female-centric film Telugammai. But later on Saloni has got the chance of pairing up with biggies of Tollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu