»   »  రామ్చరణ్ తేజ తో సలోనీ...

రామ్చరణ్ తేజ తో సలోనీ...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Saloni
'ధన 51'లో సుమంత్ సరసన నటించి, ఆ తర్వాత 'ఒక ఊరిలో..', 'కోకిల' వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసి తెరమరుగైన తార సలోని. కన్నడంలో వరుస ఆఫర్లతో బిజీగా వున్న ఆమె చాలా రోజుల విరామంతో మళ్లీ తెలుగులో అడుగుపెట్టింది. రామ్‌చరణ్ తేజ హీరోగా యస్‌యస్ రాజమౌళి రూపొందిస్తున్న సినిమాలో ఒక పాత్రను ఆమె చేస్తోంది.
గీతా ఆర్ట్స్ బానర్‌పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ . వారికి సంబంధించిన సన్నివేశాలు ఇటీవల అన్నపూర్ణా స్టూడియోస్‌లో చిత్రీకరించారు. వీటిలో సలోని కూడా పాల్గొంది. ఇందులో ఆమెది కొద్దిసేపే కనిపించినప్పటికీ కీలకమైన పాత్ర అని తెలిసింది. కన్నడంలో 'మదురై వీరన్', 'బుద్ధివంత' సినిమాలు చేసిన సలోని ఇటీవలే బాలీవుడ్‌లోనూ 'జస్ట్ మొహబ్బత్' సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాతోనైనా ఆమె దశతిరుగుతుందా అని ఎదురుచూస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X