»   »  'సెల్యూట్' చేసే రోజు ఆగస్ట్ 15...

'సెల్యూట్' చేసే రోజు ఆగస్ట్ 15...

Posted By:
Subscribe to Filmibeat Telugu
vishal
విశాల్, నయనతార తొలిసారి జంటగా నటిస్తున్న 'సెల్యూట్' (తమిళంలో 'సత్యం') సినిమా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానున్నది. రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను విక్రమ్‌కృష్ణ నిర్మిస్తున్నాడు. విశాల్ ఇందులో అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్‌గా నటిస్తున్నాడు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమాలో నటించేందుకు విశాల్ పోలీస్ ట్రైనింగ్ తీసుకున్నాడు. జుట్టుని బాగా దగ్గరగా కత్తిరించుకున్నాడు. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ ప్రధానాంశాలుగా రూపొందుతున్న ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హైలైట్ అవుతాయని తెలుస్తోంది. నిజమైన పోలీసు అధికారులు ఈ యాక్షన్ సన్నివేశాలకు సలహాదారులుగా వ్యవహరించడం విశేషం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X