»   » హీరోలతో పెళ్ళి వద్దంటున్న జూ ఎన్టీఆర్ హీరోయిన్

హీరోలతో పెళ్ళి వద్దంటున్న జూ ఎన్టీఆర్ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా హీరోను మాత్రం చేసుకోను. నాకు బిజినెస్‌ మాగ్నెట్‌ కావాలి అంటోంది సమీరా రెడ్డి. ఆమె మీడియాతో పెళ్ళి గురించి మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది. నిజానికి అశోక్, నరసింహా చిత్రాల్లో జూ ఎన్టీఆర్ సరసన నటించిన సమీరా రెడ్డి పై అప్పట్లో ఎన్టీఆర్ తో ప్రేమలో పడిందంటూ వార్తలు వచ్చాయి. పెళ్ళి దాకా వెళ్తుందని అంతా ఊహాగానాలు చేసారు. ఆ తర్వాత ఆమె జై చిరంజీవ చిత్రం చేయగానే మెల్లగా అవి రూమర్స్ అని జనం సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కీ పెళ్ళి కుదిరిపోయింది. ఆమె కూడా సినీ హీరోలను పెళ్ళి చేసుకోనంటూ స్టేట్ మెంట్స్ ఇస్తోంది. ఆమె మాటల్లోనే...'ఆహిస్తా' ఆల్బమ్‌ తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటానంటూ చాలా ప్రపోజల్స్‌ వచ్చాయి. కాని అవన్నీ నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇక అందరూ నేను ఎవరో ఒక సినిమా హీరోని పెళ్లి చేసుకుంటానని అనుకున్నారు కానీ నేను పెళ్లి ఎప్పుడు చేసుకున్నా, సినిమా హీరోను మాత్రం చేసుకోను. నాకు బిజినెస్‌ మాగ్నెట్‌ కావాలి. మాది వ్యాపార కుటుంబమే కాబట్టి నాకు అందులోని మెలకువలు తెలుసు. అలాగైనా నా భర్తకు సాయపడగలను అంటోంది. ప్రస్తుతం సమీరా రెడ్డి ... ఏ మాయ చేసావే చిత్రంతో విజయం సాధించిన దర్శకుడు గౌతమ్ మీనన్ లేటెస్ట్ చిత్రంలో చేస్తోంది. ఇంతకు ముందు కూడా సమీరా గౌతం మీనన్ దర్శకత్వంలో సూర్య సన్నాఫ్ కృష్ణన్ లో చేసిన సంగతి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu