»   » సమైక్య సెగ : ‘ఎవడు’ రిలీజ్ ఇప్పట్లో లేనట్లేనా?

సమైక్య సెగ : ‘ఎవడు’ రిలీజ్ ఇప్పట్లో లేనట్లేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనట్లు.... కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయం తెలుగు సినీ పరిశ్రమను నష్టపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రకటన తర్వాత సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడటమే ఇందుకు కారణం. ముఖ్యంగా విడుదలకు సిద్దంగా ఉన్న మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలకు పెద్ద సమస్యగా మారింది.

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవికి సమైక్యవాదులు శుక్రవారం అల్టిమేటం జారీ చేశారు. చిరంజీవి ఈ నెల 7వ తేదీలోగా సమైక్యానికి అనుకూలంగా ప్రకటన చేయకుంటే ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ నటించిన ఎవడు సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో సమైక్య ఉద్యమం చల్ల బడే వరకు 'ఎవడు' సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మరిన్ని ఆసక్తికర వివరాలు స్లైడ్ షోలో...

కలిసి రాని లక్కీ డేట్

కలిసి రాని లక్కీ డేట్

మెగా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిర జులై చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఈ కారణంగానే ఎప్పడో విడుదల కావాల్సిన సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చాయి.

మగధీర రేంజి హిట్ కావాలని

మగధీర రేంజి హిట్ కావాలని

జులై 31న విడుదల చేసేందుకు ముందుగా డేట్ ఫిక్స్ చేసారు. చరణ్ గత సినిమా మగధీర జులై 31, 2009లో విడుదలై తెలుగు సినిమా రికార్డులను తిరగరాసింది. ఈనేపథ్యంలో ‘ఎవడు' సినిమాకు ఇదే డేట్ అని ఫిక్స్ అయ్యారు.

విభజన ముందే గ్రహించిన చిరు

విభజన ముందే గ్రహించిన చిరు

కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవి విభజనకు ముందు జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో అధిష్టానం రాష్ట్ర విభజనపై కీలక నిర్ణయం తీసుకోబోతుందనే విషయం గ్రహించారు. వెంటనే 31న విడుదల కావాల్సిన ‘ఎవడు' సినిమాను నిలిపివేయించారు.

ఆగస్టు 21కి మారిన డేట్

ఆగస్టు 21కి మారిన డేట్

చిరంజీవి ఊహించినట్లే జరిగింది. రాష్ట్ర విభజనపై కేంద్ర నిర్ణయం తీసుకుంది. దీంతో ‘ఎవడు' సినిమాను ఆగస్టు 21కి వాయిదా వేసారు. దాదాపు 20 రోజుల సమయం ఉండటంతో అప్పటి వరకు అన్నీ సద్దుమనుగుతాయని ఈ డేట్ ఫిక్స్ చేసారు.

కానీ ఉద్యమం చల్లారేలా లేదు

కానీ ఉద్యమం చల్లారేలా లేదు

ప్రస్తుతం సీమాంధ్రలో ఉద్యమం ఉప్పుడప్పుడే చల్లబడేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆగస్టు 21న సినిమా విడుదల అవుతుందా? లేదా? అనే విషయంపై అయోమయం నెలకొంది. పరిస్థితి ఇలానే ఉంటే మాత్రం సినిమాను మరిన్ని రోజులు వాయిదా వేసే అవకాశం ఉంది.

బోలెడు ఆశలు పెట్టుకున్నారు

బోలెడు ఆశలు పెట్టుకున్నారు

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎవడు సినిమా తెరకెక్కింది. శృతి హాసన్, ఎమీ జాక్సన్ హీరోయిన్లు. దిల్ రాజు నిర్మాత. ఈచిత్రంపై మెగా ఫ్యామిలీ పూర్తి నమ్మకంతో ఉంది. ఆడియో వేడుకలో చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా మగధీరను మించిన హిట్టవుతుందని స్పష్టం చేసారు.

ఈ సారి జులై నెల కొలిసిరాలేదు

ఈ సారి జులై నెల కొలిసిరాలేదు

చరణ్ గత సినిమా మగధీర జులై 31, 2009లో విడుదలై తెలుగు సినిమా రికార్డులను తిరగరాసింది. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరుక వచ్చిన భారీ బ్లాక్ బస్టర్స్... తొలిప్రేమ(24 జులై, 1998), ఇంద్ర(జులై 25, 2002), మగధీర(31 జులై, 2009)లాంటి సినిమాలన్నీ జులై చివరి వారంలో విడుదలైనవే కావడం గమనార్హం. కానీ ఈ సారి మాత్రం జులై నెలలో సినిమాను విడుదల చేయసుకోలేక పోయారు.

ఇతర వివరాలు

ఇతర వివరాలు

‘ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. వారి పాత్రలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. జయసుధ, సాయికుమార్‌, కోట శ్రీనివాసరావు, రాహుల్‌దేవ్‌, అజయ్‌, ఎల్బీ శ్రీరామ్‌, సుప్రీత్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, కళ: ఆనంద్‌ సాయి, సహ నిర్మాతలు: శిరీష్‌ - లక్ష్మణ్‌, నిర్మాత : దిల్ రాజు, దర్శకత్వం : వంశీ పైడిపల్లి.

English summary
Samaikyandhra Protests effect on Yevadu Release. Ram Charan Teja's highly-anticipated Telugu movie Yevadu was to hit the screens in Andhra Pradesh on July 31, but the makers of the film have postponed its release to August 21.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu