For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాజుగారి గది 2 లో "సుచీలీక్స్" : సమంతా

  |

  టాలీవుడ్ లో హర్రర్ కమెడీ కి ఒక ప్రత్యేకమైన ఆధరణ ఉంది, ఆ జోనర్ లో నాగారున లాంటి స్టార్ హీరో చేయటం రాజుగారి గది 2 కి మంచి భారీతనాన్ని తెచ్చింది. ఈ హర్రర్ సినిమాలో సమంత ఒక ఆత్మ పాత్రలో కనిపించనుంది. ఇన్నాళ్లు ఎక్కువగా కమర్షియల్ రోల్స్ మాత్రమే చేసిన సమంత తొలిసారి భిన్నమైన పాత్ర చేయడంతో ఆ పాత్ర, అందులో సమంత కొత్త తరహా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు.ఈ పాత్ర గురించే మాట్లాడిన చిత్ర దర్శకుడు ఓంకార్ సమంత చాలా గొప్పగా నటించారని, ఇందులో ఆమె కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూడొచ్చని, ముఖ్యంగా క్లైమాక్స్ లో అయితే నాగార్జున, సమంతల నటన చాలా అద్భుతంగా ఉంటుందని, వాళ్లిద్దరే సినిమాను నడిపించారని చెప్పుకోచ్చారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం చిత్రబృందం మీడియా సమావేశం నిర్వహించింది. సమావేశంలో మాట్లాడిన యువసామ్రాట్ తాను సమంతకు బిగ్ ఫ్యాన్‌ను అని ఆసక్తికర విషయం చెప్పాడు. అంతే కాదు నాగార్జున సమంతా కూడా ఈ రోజు విడుదల అవుతున్న ఈ సినిమాలో తమ పాత్రల గురించి ఇలా చెప్పుకొచ్చారు...

   నేను సమంతకు బిగ్ ఫ్యాన్‌

  నేను సమంతకు బిగ్ ఫ్యాన్‌

  రాజుగారి గది-2లో మీ కోడలు పాత్ర మిమ్మల్ని డామినేట్ చేస్తుందా అని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు..... నాగార్జున.. మాట్లాడుతూ ‘ నేను సమంతకు బిగ్ ఫ్యాన్‌.. ఏమాయ చేశావె సినిమా చూసిన తర్వాత సమంతకు ఫోన్ చేసి చాలా బాగా చేశావ్.. ఐయామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ' అని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. పక్కనే ఉన్న సమంతను ఫోన్ చేసిన విషయం గుర్తుందా అని అడగ్గా.. అవును అంటూ నవ్వింది సమంత.

  Raju Gari Gadhi 2 Movie Public Review : A Must Watch Movie For This Weekend - Filmibeat Telugu
  ఇదే కెరియర్‌లో బెస్ట్ అవ్వకూడదు

  ఇదే కెరియర్‌లో బెస్ట్ అవ్వకూడదు

  రాజుగారి గది-2 సినిమాలో అందరూ బాగా నటించారు. ఈ మూవీ చాలా బాగుంటుంది. మూవీ క్లైమాక్స్‌లో సీన్లు, డైలాగ్‌లు మొత్తం సమంత పాత్రను లీడ్ చేస్తాయని నాగార్జున చెప్పాడు. ఈ పాత్రకు సరిపడా సమంత చాలా మంచిగా చేసింది.. సమంతది చాలా బ్రిలియంట్ ఫర్ఫామెన్స్.. ఇదే కెరియర్‌లో బెస్ట్ అవ్వకూడదు.. ఇంకా చాలా మంచి పాత్రలు చేయాలని నాగార్జున ఆకాంక్షించాడు.

   పెళ్లికి అంగీకరిస్తాననీ ఆలోచించుకుని

  పెళ్లికి అంగీకరిస్తాననీ ఆలోచించుకుని

  ఈ ప్రాజెక్ట్‌ చాలా ప్రత్యేకమైనదని తనకు తెలుసు. అప్పటికీ చైతూ, సమంత పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారన్న విషయం నాకు తెలీదు. పీవీపీ, నేను, ఓంకార్‌ ఉన్నాం కాబట్టి తప్పకుండా మంచి సినిమానే తీస్తామనీ, పెళ్లికి అంగీకరిస్తాననీ ఆలోచించుకుని చిన్న పాత్రే అయినా ఒప్పుకుంది. క్లైమాక్స్‌లో నన్ను డామినేట్‌ చేసేలా నటించింది. ఇప్పటి వరకూ తను చేసిన సినిమాల్లో కెరీర్‌ బెస్ట్‌ క్యారెక్టర్‌ ఇది. సినిమా మీద విపరీతమైన ప్రేమతో ఓంకార్‌ ఈ సినిమా తీశాడు. అతనికి మంచి పేరు రావాలి'' అని అన్నారు.

  చిన్న పాత్రే అయినా చాలా తృప్తినిచ్చింది

  చిన్న పాత్రే అయినా చాలా తృప్తినిచ్చింది

  సమంత మాట్లాడుతూ ‘‘కొన్ని సినిమాలో మొదటి నుంచీ చివరి వరకూ కనిపించే పాత్రలు చేశా. వాటిని ఎందుకు చేశానో నాకే తెలీదు. ఇందులో చిన్న పాత్రే అయినా చాలా తృప్తినిచ్చింది. సినిమా హిట్‌ అయినా, ఫ్లాప్‌ అయినా వారంలో మరచిపోయే రోజులివి. సినిమాకు పని చేసిన ఆరు నెలల అనుభవం నాకు ముఖ్యం.

  సుచీలీక్స్‌

  సుచీలీక్స్‌

  ఈ క్యారెక్టర్‌ చేసిన సమయంలో సోషల్‌ మీడియాలో ‘సుచీలీక్స్‌' పేరుతో కాంట్రవర్సీ జరిగింది. ఆ వీడియో ఓపెన్‌ చేసినవాళ్లకు, చూసిన వాళ్లకు, సర్య్కులేట్‌ చేసిన ప్రతి ఒక్కరికీ ఈ పాత్ర సందేశం ఇస్తుంది. ఇందులో ఏడ్చిన ప్రతిసారీ గ్లిజరిన్‌ వాడకుండా చేశా'' అని తెలిపారు. వ్యక్తిగత విషయాల గురించి చెబుతూ ‘‘అక్కినేని ఫ్యామిలీకి కోడలిగా రావడమంటే ఒక బాధ్యత అని నాకు ముందే తెలుసు. నాకు ఇప్పుడు మరింత బాధ్యత పెరిగింది.

   నా బెస్ట్‌ ఫ్రెండే నాకు భర్త

  నా బెస్ట్‌ ఫ్రెండే నాకు భర్త

  నా బెస్ట్‌ ఫ్రెండే నాకు భర్త అయినందుకు చాలా ఆనందంగా ఉంది'' అని తెలిపారు. కోడలిగా అన్నపూర్ణ స్డూడియోస్‌ బాధ్యతలు తీసుకుంటారా అన్న ప్రశ్నకు ‘‘అక్కినేని కుటుంబంలో ఆడవాళ్లంతా ఇండిపెండెంట్‌గా ఉంటారు. అమలగారు, సుప్రియగారు చాలా స్ట్రాంగ్‌. వాళ్లు బాధ్యతలు ఇస్తారని, ఇవ్వాలనీ నేను అనుకోను. కానీ నా వంతుగా చెయ్యడానికి సిద్ధంగానే ఉంటాను'' అని సమాధానమిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఓంకార్‌, తమన్‌, సీరత్‌ కపూర్‌, వెన్నెల కిశోర్‌, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

  English summary
  Rajugari Gadi 2 the Movie which is releasing today, Samantha and Nagarjuna Shared about thair charectors in this Moviey yester day press meet
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X