»   » నాగచైతన్యతో రొమాంటిక్ ఎక్స్‌పీరియన్స్‌...సమంతా

నాగచైతన్యతో రొమాంటిక్ ఎక్స్‌పీరియన్స్‌...సమంతా

Posted By:
Subscribe to Filmibeat Telugu

పెద్ద హీరో నాగార్జున కొడుకుని అనే ఫీలింగ్‌ చైతన్యలో అస్సలు కనిపించదు. సినిమాల్లో పాత్రల ప్రకారం మా ఇద్దరికి వయసురీత్యా రెండేళ్ల తేడా వుందేమో...కానీ వాస్తవంగా ఇద్దరం ఒకే వయసు వాళ్ళం కాబట్టి చాలా సరదాగా వుండేవాళ్లం. తనతో వర్క్‌ చేయడం హ్యాపీగా అనిపించింది. ఎంతో ఎనర్జీతో సెట్‌లో హ్యాపీగా వుంటాడు అంటూ నాగచైతన్యతో తన ఎక్సపీరియన్స్ వివరిస్తోంది సమంత. 'ఏ మాయ చేసావె' చిత్రంలో జెస్సీ పాత్రలో చేసిందంటూ ఆమెకు ప్రశంసలు వస్తున్నాయని చెప్తోంది. ఇక నాగచైతన్యతో రొమాంటిక్‌ సన్నివేశాలు, ముద్దు సన్నివేశాలు చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్‌ అన్న దానికి సమాధానంగా నేను కేవలం జెస్సీ పాత్రలో ఒదిగిపోయి నటించాను. కథకు తగ్గట్టుగా గౌతమ్‌ సర్‌ ఏది చెబితే అది చేశాను అంటోంది. ప్రస్తుతం సమంత...వంశీ పైడిపల్లి రూపొందిస్తున్న 'బృందావనం' లో ఎన్టీఆర్ సరసన సెకెండ్ హీరోయిన్ గా చేస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఆ చిత్రంలో సమంత పాత్ర పేరు 'ఇందు' .మోడ్రన్‌గా సాగిపోయే పాత్ర అది. మెయిన్ హీరోయిన్ గా కాజల్ చేస్తోంది. అలాగే మహేష్ సరసన కూడా ఆమెకు ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu