»   » సమంతా పెళ్ళికి ముందే ఇంకో బాంబ్ వేసింది : నేను నాలాగే ఉంటా, సినిమాలకు నో చెప్పను

సమంతా పెళ్ళికి ముందే ఇంకో బాంబ్ వేసింది : నేను నాలాగే ఉంటా, సినిమాలకు నో చెప్పను

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ ప్రేమ పక్షులు నాగచైతన్య, సమంతల వివాహం అక్టోబర్ 6,7 తేదీల్లో అట్టహాసంగా జరుగనున్న సంగతి తెలిసిందే. పెళ్లి పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సమయంలో పెళ్లి తర్వాత ఏంటనేది సమంత చెప్పుకొచ్చింది. పెళ్లయిన వెంటనే కెరీర్‌కు ఫుల్ స్టాప్.. కామా లాంటివి పెట్టనని చెబుతోంది సామ్. ఆమె నెక్ట్స్ ప్రాజెక్ట్ రాజుగారి గది-2 విడుదలకు సిద్ధమవుతోంది. రంగస్థలం మూవీ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

పెళ్ళైతే అన్ని మారిపోతాయి

పెళ్ళైతే అన్ని మారిపోతాయి

సాధారణంగా ఒక అమ్మాయికి పెళ్ళైతే అన్ని మారిపోతాయి. కోడలిగా ఒకరి ఇంట్లో అడుగుపెట్టినప్పుడు కొన్నిటిని వదిలేసుకోవాలి. ఇక తారల విషయంలో కూడా చాలా వరకు ఇదే ధోరణి కనిపిస్తూ ఉంటుంది. కానీ తన లైఫ్ మాత్రం అలా ఉండబోదని చెబుతోంది సమంత.

క్రికెటర్ బయోపిక్ లో సమంత Samantha in Mithali Raj Biopic
హద్దులు చెప్పరని నా నమ్మకం

హద్దులు చెప్పరని నా నమ్మకం

పెళ్లి తర్వాత పెను మార్పులు చోటు చేసుకుంటాయో లేదో నాకు తెలియదు కాని తన వ్యక్తిగత జీవితానికి మాత్రం చైతు గాని అతని కుటుంబ సభ్యులు గాని ఎలాంటి హద్దులు చెప్పరని నా నమ్మకం అంటూ.. వారి సపోర్ట్ తప్పకుండా తనకు ఉంటుందని చెప్పింది. ముఖ్యంగా సినిమా లేనిది తను లేను అంటోంది.

నేను నాలాగే ఉంటా

నేను నాలాగే ఉంటా

పెళ్లి తర్వాత ఏం మార్పులు జరగబోతున్నాయని అమ్మడిని అడిగితే.. "నేను నాలాగే ఉంటా.. పెళ్లి తర్వాత మార్పులైతే ఏమీ ఉండవు. కెరీర్ మొదట్లో వేరే వాటి గురించి కళలు కన్నాను కానీ సినిమాల్లోకి వచ్చాకా అదే నా ప్రపంచం అయ్యింది. సో సినిమాలకు నో అయితే అస్సలు చెప్పను అని వివరించింది సమంత.

చాలా అదృష్టవంతురాలిని

చాలా అదృష్టవంతురాలిని

దానికో కారణం కూడా ఉందంటోంది.. సినిమా ఇండస్ట్రీలో లో తనకంటే అందమైన ప్రతిభావంతులైన నటులు చాలామందే ఉన్నా ప్రముఖ చిత్రాల్లో ప్రముఖ పాత్రలను చేసే అవకాశం లబిస్తోంది. దీంతో తను ఆ విషయంలో చాలా అదృష్టవంతురాలినని చెప్పింది.

English summary
Samantha Ruth Prabhu is working like there’s no tomorrow as she’s getting ready for her big fat wedding with Naga Chaitanya in October. Samantha about her life after marriage
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu