»   » పవన్,మహేష్,ఎన్టీఆర్ ల గురించి సమంత (ఫొటో ఫీచర్)

పవన్,మహేష్,ఎన్టీఆర్ ల గురించి సమంత (ఫొటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తెలుగులో టాప్ హీరోయిన్ ఎవరంటే సమంత అని టక్కున చెప్పేస్తారు. ఆమె వరసగా పెద్ద హీరోలు సినిమాలన్నీ చేసుకుంటూ పోతోంది. 2013 బిగ్గెస్ట్ హిట్ లలో ఆమె షేర్ ఉంది. తమిళంలో తొలి చిత్రం ఫ్లాప్ అయినా తెలుగులో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ స్దాయికి అతి కొద్ది కాలంలోనే ఎదిగిపోయి...అప్పటికే పాతుకుపోయిన మిగతా హీరోయిన్స్ జండాలు పీకేసింది.

ఇక సమంత ఎవరితో నటించినా చూడముచ్చటగా ఉంటుంది. అదే.. సమంతలోని మ్యాజిక్‌ అంటారు ఆమె అభిమానులు. నాగచైతన్య నుంచి నాని వరకూ, ఎన్టీఆర్‌ నుంచి పవన్‌ కల్యాణ్‌ వరకూ.. ఎవరైనా సరే - వారి పక్కన సమంత అందంగా ఇమిడిపోతుంది. ఏమిటి ఆ సీక్రెట్ అని సమంతని అడిగితే ''అది నా గొప్పదనం కాదు.. నా హీరోలదే'' అంటోంది.


ఇవన్నీ ప్రక్కన పెడితే... ఒక్కో హీరో కెమిస్ట్రీ ఒక్కో హీరోయిన్ తో కుదురుతుంటుంది. సమంత అలా కాదు. 'ఏ మాయ చేశావె' నుంచి 'రామయ్యా వస్తావయ్యా' వరకూ సమంత జోడీ కట్టిన హీరోల గురించి, వారిలో సమంతకు నచ్చిన లక్షణాల గురించీ మీడియాకు చెప్పింది...

ఆ ముచ్చట్లు.. స్లైడ్ షో లో...

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్''పవన్‌ కల్యాణ్‌ ఓ సూపర్‌స్టార్‌. ఆయన కెమెరా ముందే నటిస్తారు. బయట కాదు. ఆ కళ్లు చూసి చెప్పేయొచ్చు. ఆయనంటే ఏమిటో. అంత ఇమేజ్‌, అంతమంది అభిమానగణం ఎన్నున్నా.. ఏమీ లేనట్టే ఉంటారు. అది ఎవరికోగానీ సాధ్యం కాదు. 'అత్తారింటికి దారేది' సినిమా విడుదలకు ముందే బయటకు వచ్చేసింది. అయినా ఆయన చలించలేదు. మా అందరిలోనూ ధైర్యాన్ని నూరిపోశారు. నా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఆయన భాగస్వామ్యం ఉంది. 'గబ్బర్‌ సింగ్‌'లోని పోలీస్‌ దుస్తుల్ని అందించారు. యూనిఫామ్‌ వేలం ద్వారా వచ్చిన ఆదాయంతో ఓ మంచి పని చేస్తా''.

మహేష్ బాబు

మహేష్ బాబు

''మహేష్‌బాబు సెట్లో ఉన్నారంటే.. నాకు సమయమే తెలీదు. ఆయన చాలా సరదా మనిషి. సైలెంట్‌గానే జోకులేస్తారు. 'దూకుడు'లో నేనూ, మహేష్‌ గొడవపడే సన్నివేశాలున్నాయి. అక్కడ నేను చాలా సీరియస్‌గా కనిపించాలి. కానీ మహేష్‌ని చూస్తే నవ్వు ఆగేది కాదు. 'దూకుడు' సమయంలో.. నాకెన్నో విలువైన సలహాలిచ్చారు. అవన్నీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో పాటించా. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ రెండు సినిమాల్లోనూ చాలా బాగా కుదిరింది. అవకాశం వస్తే.. ఆయనతో మరోసారి నటించి హ్యాట్రిక్‌ కొట్టేస్తా''.

నాని

నాని

''అదేంటో తెలీదుగానీ.. నా హీరోలందరితోనూ ఒకటి కంటే ఎక్కువసార్లే నటించే అవకాశం వచ్చింది. నానితో కూడా అంతే. 'ఈగ', 'ఎటోవెళ్లిపోయింది మనసు' సినిమాల్లో నానితో కలసి నటించా. 'ఈగ'లో మా ఇద్దరి మధ్య ఉన్నవి తక్కువ సన్నివేశాలే. అయినా సినిమా అంతా తనతో ప్రయాణం చేస్తున్నట్టే అనిపించింది. నాని చాలా ప్రతిభావంతుడు. అతని కమిట్‌మెంట్‌ నాకు బాగా నచ్చింది''.

ఎన్టీఆర్

ఎన్టీఆర్

''నా కెరీర్‌ తొలినాళ్లలోనే ఎన్టీఆర్‌తో నటించే అవకాశం వచ్చింది. నిజంగా అది నా సినీ జీవితానికి చాలా దోహదం చేసింది. 'బృందావనం'లో అవకాశం రాగానే నేను చేసిన తొలి పని.. ఎన్టీఆర్‌ గత సినిమాల్ని చూడడం. 'స్టూడెంట్‌ నెం.1' నుంచి 'యమదొంగ' వరకూ అన్నీ చూసేశా. 'వామ్మో.. ఏం జోరు..' అనిపించింది. సెట్లోనూ అంతే ఉత్సాహంతో పని చేసేవారు. ఎన్టీఆర్‌ని చూడ్డానికే సెట్‌కి వెళ్లేదాన్నంటే నమ్మండి. చిన్న సీన్‌ అయినా సరే.. వంద శాతం కృషి పెడతారు. ఇక డాన్స్‌ గురించి ఏం చెప్పను..? చాలాసార్లు నా స్టెప్‌ మర్చిపోయేదాన్ని. అలాంటి డాన్సర్‌ని ఇంకెక్కడా చూళ్లేదు''.

నాగచైతన్య

నాగచైతన్య

''నా తొలి హీరో నాగచైతన్య. 'ఏ మాయ చేశావె' ముందు ఆయనకు కెమెరా అనుభవం ఉంది. నాకేమో కొత్త. తెలుగు కూడా రాదు. అయినా నన్ను ఓపిగ్గా భరించారు. ఓ స్టార్‌ ఇంటి నుంచి వచ్చినా... సెట్లో ఒద్దికగా ఉండేవారు. సీన్‌ అయిపోగానే.. కామ్‌గా తన పని తాను చేసుకొనేవారు. మా మధ్య టాపిక్‌లు రెండే. ఒకటి వాళ్ల కుటుంబం, రెండోది సినిమాలు. 'ఆటోనగర్‌ సూర్య'లో చైతూతో మరోసారి జోడీ కట్టే అవకాశం వచ్చింది. తప్పకుండా ఈ సినిమా కూడా మీ అందరికీ నచ్చుతుంది''.

సిద్దార్ధ్

సిద్దార్ధ్

''సిద్దార్థ్‌ నేనూ 'జబర్‌దస్త్‌'లో నటించాం. మా ఇద్దరి ఆలోచనలూ ఒక్కటే. ఒక విషయం గురించి ఇద్దరం ఒకేలా స్పందిస్తాం. సినిమా, ఇల్లు... ఈ రెండే అతనికి తెలిసినవి. సినిమా లేకపోతే కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యమిస్తాడు. నేనూ అంతే కదా..? సినిమాకి సంబంధించిన ఏ విషయాన్ని అయినా క్షుణ్ణంగా, సుదీర్ఘంగా మాట్లాడేస్తాడు. దర్శకత్వంలోనూ అనుభవం ఉంది. అతని ఆలోచనలెప్పుడూ వినూత్నంగా, ఎదుటివారిని కట్టిపడేసేలా ఉంటాయి''.

సమంత గొంతు...

సమంత గొంతు...

'ఏ మాయ చేశావె' నుంచి చిన్మయి గొంతుపై ఆధారపడుతోంది సమంత. ఆమె గాత్రం.... సమంతకు బాగానే నప్పింది. అయితే ఎంతోకాలం పరాయి గొంతుపై ఆధారపడడం భావ్యం కాదు అనుకొంటోంది సమంత. అందుకే తన సంభాషణలు తానే పలకాలనే నిర్ణయం తీసుకొందట. ''తెలుగు భాష బాగానే మాట్లాడుతున్నా. డబ్బింగ్‌ చెప్పుకోవాలని ఉంది. అయితే.. దానికి నా దర్శకుల అనుమతి, ప్రోత్సాహం కావాలి..'' అంటోంది సమంత. ఈ సినిమాల్లో అయినా సమంత గొంతు వినిపిస్తుందేమో చూడాలి.

ఇప్పుడేం చేస్తోంది...

ఇప్పుడేం చేస్తోంది...

ప్రస్తుతం ఎన్టీఆర్‌, నాగచైతన్య సరసన నటిస్తోంది. వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ సమంతే హీరోయిన్ . తమిళంలోనూ సూర్య సరసన చేస్తోంది. ఈ చిత్రాలు ఘన విజయం సాధిస్తాయంటున్నారు.

English summary

 Samantha says that she is happy to work with Big Tollywood Hero's. Samantha now working with Naga Chaitanya and Ntr Films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu