twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ వార్తలను నమ్మొద్దు.. అవి గాసిప్సే.. సన్నిహితుల క్లారిటీ.. మౌనంగా సమంత..

    By Rajababu
    |

    అక్కినేని నాగచైతన్యతో వివాహం తర్వాత కూడా సినీ పరిశ్రమలో సమంత క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. వివాహం తర్వాత వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కోరిక మేరకు చేనేత ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆమె రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. ఆ వార్తలపై సమంత సన్నిహితులు ఏమని స్పందించారంటే..

    Recommended Video

    రాజకీయాల్లోకి నాగార్జున కోడలు ?
     రాజకీయాల్లోకి సమంత అక్కినేని

    రాజకీయాల్లోకి సమంత అక్కినేని

    గత రెండు రోజులుగా సమంత రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఓ వార్త మీడియాలో హల్‌చల్ చేసింది. సమంతను రాజకీయాల్లోకి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఆయన కుమారుడు, మంత్రి కే తారకరామారావు కోరినట్టు ఆ వార్త కథనం సారాంశం.

     సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి పోటీ

    సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి పోటీ

    వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సమంతను టీఆర్ఎస్ పార్టీ తరపున సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దించే ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ కథనంలో వండి వడ్డించారు. క్రిస్టియన్ ఓటు బ్యాంకును సొంతం చేసుకొనేందుకు గతంలో కాంగ్రెస్ జయసుధ‌ను ఉపయోగించుకొన్న మాదిరిగానే సమంతను ఈ సారి టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.

    ఆ వార్తలో వాస్తవం లేదు

    ఆ వార్తలో వాస్తవం లేదు

    అయితే రాజకీయ ప్రవేశానికి సంబంధించిన మీడియా వార్తలను సమంత సన్నిహితులు కొట్టిపడేశారు. ఆ వార్తల్లో వాస్తవం లేదు అని స్పష్టం చేశారు. సమంతకు పాలిటిక్స్ అంటే ఇష్టం లేదు అని వారు పేర్కొంటున్నారు.

     ఐదు చిత్రాలతో బిజీ బిజీ

    ఐదు చిత్రాలతో బిజీ బిజీ

    సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం సమంత చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. ఆమె నటించిన రంగస్థలం, మహానటి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కన్నడ చిత్రం ఆధారంగా రూపొందుతున్న యూటర్న్ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నది.

     తమిళంలో సమంత

    తమిళంలో సమంత

    ఇక తమిళంలో శివకార్తీకేయన్ సరసన, అలాగే త్యాగరాజన్ కుమారరాజా చిత్రాల్లో సమంత నటిస్తున్నది. అలాగే సూర్యతో కలిసి కూడా ఓ చిత్రంలో నటిస్తున్నట్టు సమాచారం.

    English summary
    Samantha Akkineni's supposed political entry have been spreading like wildfire in media. There was speculation that Telangana Chief Minister, Kalvakuntla Chandrashekhar Rao's (KCR) son and minister K Tarak Ramarao (KTR) was planning to convince the actress to enter politics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X