»   » ప్రతీచోట నీచులుంటారు.. హీరోలను నిలదీసే దమ్ముందా? క్యాస్టింగ్ కౌచ్‌పై సమంత!

ప్రతీచోట నీచులుంటారు.. హీరోలను నిలదీసే దమ్ముందా? క్యాస్టింగ్ కౌచ్‌పై సమంత!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Samantha First Time Responds On Industry Culture

  వివాదాస్పద హీరోయిన్ శ్రీరెడ్డి వివాదం తెలుగు సినీ పరిశ్రమను కొద్ది నెలలుగా కుదిపేస్తున్నది. వేషాలు ఎరవేసి కొంతమంది సినీ ప్రముఖులు తనను శారీరకంగా చాలా మంది వాడుకొన్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వివాదం నేపథ్యంలో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అనధికార నిషేధం విధించడంతో శ్రీరెడ్డి అర్థనగ్న ప్రదర్శన చేయడం మరింత సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో క్యాస్టింగ్ కౌచ్‌ (వేషాల కోసం పడకగది)పై ప్రముఖ సినీ హీరోయిన్ సమంత అక్కినేని స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ వివాదంపై ఆమె ఏమన్నారంటే..

  ప్రతీ ఇండస్ట్రీలోనూ

  ప్రతీ ఇండస్ట్రీలోనూ

  క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక్క సినీ పరిశ్రమలోనే లేదు. ప్రతీ రంగంలోనూ ఉన్నది. ఈ అంశంపై వివరంగా నేనేమీ మాట్లాడబోను. అమ్మాయిల బలహీనతలను సొమ్ము చేసుకొనే నీచులు ప్రతీచోటా ఉన్నారు. నా తొలిసినిమా సూపర్ హిట్ కావడం వల్ల సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి నేను అంతగా కష్టపడాల్సి రాలేదు. గత ఎనిమిదేళ్లుగా నేను తమిళ, తెలుగు పరిశ్రమల్లో పనిచేస్తున్నాను. నాకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదు.

  అద్భుతమైన జీవితాన్ని

  అద్భుతమైన జీవితాన్ని

  సినీ పరిశ్రమలో కేవలం చెడు మాత్రమే లేదు. చాలా మంచి విషయాలు కూడా ఉన్నాయి. నా కెరీర్‌లో నాకు అద్భుతమైన వ్యక్తులు తారసపడ్డారు. సినీ పరిశ్రమ నాకు అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించింది. అందుకే నేను పెళ్లి తర్వాతే కాదు.. పిల్లలు పుట్టిన తర్వాత కూడా నటించాలని అనుకొంటున్నాను.

  ప్రభుత్వ స్పందన భేష్

  ప్రభుత్వ స్పందన భేష్

  సినీ పరిశ్రమలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, లైంగిక వేధింపులపై విచారించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామం అని సమంత అన్నారు.

  ఒకరు చెప్పనక్కర్లేదు

  ఒకరు చెప్పనక్కర్లేదు

  బీ‌చ్‌లో బికినీ ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం, దానిని కొందరు ట్రోల్ చేయడంపై సమంత స్పందించారు. బికినీ ఫొటో పోస్ట్ చేస్తే ట్రోల్ చేస్తారని నాకు తెలుసు. అలా అని బీచ్‌లో చీరకట్టుకొని ఫోటో దిగాలా? ఎవరి కోసమో నేను ఫొటో పోస్ట్ చేయలేదు. నేను ఏలాంటి ఫొటోలు పోస్టు చేయాలో నాకు ఒకరు చెప్పనక్కర్లేదు.

   నేను ఎవరికీ భయపడను

  నేను ఎవరికీ భయపడను

  నేను వివాహితను కాబట్టి వాళ్లు కావాలని నన్ను ట్రోల్ చేశారు. నేను ఎలా ఉండాలో నాకు ఒకరు చెప్పనక్కర్లేదు. నా జీవితాన్ని ఎలా ఉంచుకోవాలో నాకు బాగా తెలుసు. నేను ఒకరికి భయపడను. ఒకరి ట్రాప్‌లో పడను అని సమంత ఘాటుగా స్పందించారు.

  అది కెమెరా ట్రిక్

  అది కెమెరా ట్రిక్

  రంగస్థలం సినిమాలో లిప్‌లాక్ గురించి సమంత వివరణ ఇచ్చారు. అదంతా ఓ కెమెరా ట్రిక్ మాత్రమే. నేను కేవలం రాంచరణ్ బుగ్గ మీద మాత్రమే ముద్దు పెట్టుకొన్నాను. పెళ్లైన తర్వాత అలాంటి సీన్లు చేస్తే నన్ను తిడుతారని తెలుసు అని సమంత పేర్కొన్నారు.

  హీరోలను నిలదీసే దమ్ముందా?

  హీరోలను నిలదీసే దమ్ముందా?

  ఒకవేళ పెళ్లైన హీరోలు చేస్తే వారిని ప్రశ్నించే దమ్ముందా? అని సమంత నిలదీశారు. ఇలాంటి ప్రశ్నలు కేవలం పెళ్లైన హీరోయిన్లనే ఎందుకు అడుగుతారు. ఈ విషయంలో నాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే నా ఫ్యామిలీ నాకు అండగా నిలబడుతుంది. నా మామయ్య నాగార్జున అర్థం చేసుకొంటారు. అందుకే నేను సెట్స్‌లో చాలా కంఫర్ట్‌గా ఉంటాను అని సమంత చెప్పింది.

  English summary
  Actress Samantha Akkineni opened up on her stance on the ongoing casting couch controversy. Samantha said, "Casting couch exists in every industry and not just in films. I can't comment about each and everyone's virtue or qualities. There will be a few black sheep everywhere. But, I am working in Tamil and Telugu industry for the last eight years. My first film was a hit and I didn't have much of a struggle."
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more