క్యూట్‌గా సమంత యూటర్న్.. అసలేం జరుగుతున్నదంటే..
రంగస్థలం, మహానటి, అభిమన్యుడు చిత్రాల సక్సెస్‌తో జోష్ మీద ఉన్న సమంత అక్కినేని ప్రస్తుతం కన్నడలో విజయం సాధించిన యూటర్న్ సినిమా రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల టాకీ పార్ట్‌ను శరవేగంగా పూర్తి చేసుకొన్నది.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నట్టు సమాచారం. త్వరలోనే ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. యూటర్న్ చిత్రానికి కూడా కన్నడ దర్శకుడు పవన్ కుమార్ డైరెక్షన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత.
Recommended Video


త్వరలోనే పాటల చిత్రీకరించడానికి యూనిట్ ప్లాన్ చేస్తున్నది. మిస్టరీ థ్రిలర్ల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టుగా కనిపించనున్నారు. ఆది పినిశెట్టి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











