twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పిల్లలతో సమంత.. వావ్! అక్కినేని కోడలిగా సూపర్ అనిపించుకున్న స్టార్ హీరోయిన్

    |

    అక్కినేని సమంత.. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ టాప్ హీరోయిన్. తెలుగు చిత్రసీమలో భారీ పాపులారిటీతో పాటు సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ముద్దుగుమ్మ సమంత. సినీ హీరోయిన్‌గా ఇంత క్రేజ్ సంపాదించిన సామ్.. పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సామాజిక సేవలు అందించడం లోనూ ముందుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె ఆంధ్రా ఆసుపత్రిలోని హార్ట్‌ అండ్‌ బ్రెయిన్‌ సెంటర్‌‌కి వెళ్లి వావ్ అనిపించుకుంది. ఇంతకీ సమంత ఆ ఆసుపత్రికి ఎందుకెళ్లినట్లు? వివరాల్లోకి పోతే..

    సినిమాలతో పాటు అవి కూడా..

    సినిమాలతో పాటు అవి కూడా..

    స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతూనే అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడిన సమంత, అక్కినేని కోడలిగా సినీ వారసత్వాన్ని కొనసాగిస్తోంది. అదేవిధంగా సినిమాలతో పాటు ఓ స్వచ్చంద సేవా సంస్థ నిర్వహిస్తూ ఎంతో మందికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తోంది.

    సమంత సాయం.. గత ఐదేళ్లుగా

    సమంత సాయం.. గత ఐదేళ్లుగా

    ‘ప్రత్యూష సపోర్ట్‌' అనే పేరుతో సమంత ఓ స్వచ్ఛంద సేవా సంస్థ నడిపిస్తోంది. ఈ మేరకు ఆంధ్రా ఆసుపత్రితో కలిసి గత 5 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గుండె జబ్బులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న చిన్న పిల్లలకు ఈ ప్రత్యూష సపోర్టు ద్వారా చికిత్స అందిస్తోంది. అంతేకాదు వీటితో పాటు ప్రాణాపాయ వ్యాధులకు కూడా ప్రత్యూష సపోర్టు ద్వారా వైద్యం అందిస్తూ పేద వారికి ఎంతో హెల్ప్ అవుతోంది సామ్.

    పిల్లలతో కాసేపు గడిపి..

    పిల్లలతో కాసేపు గడిపి..

    ఈ నేపథ్యంలో సోమవారం రోజు ఆంధ్రా ఆసుపత్రిని విజిట్ చేసింది సమంత. తాను నిర్వహిస్తున్న ప్రత్యూష సపోర్ట్ సహకారంతో వైద్యం చేయించుకున్న పిల్లలతో కాసేపు గడిపి వారిలో కొత్త ఉత్సాహం తీసుకొచ్చింది. అదేవిధంగా అక్కడి డాక్టర్లతో మాట్లాడి, పిల్లల ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుంది సమంత.

    అక్కినేని కోడలిగా సమంత.. నెటిజన్స్ రియాక్షన్

    అక్కినేని కోడలిగా సమంత.. నెటిజన్స్ రియాక్షన్

    ఇంతమంది పిల్లలను ఒకేసారి కలవటం, వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండటం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని ఈ సందర్బంగా సమంత పేర్కొంది. ఈ మేరకు తాను ఆంధ్రా ఆసుపత్రిని విజిట్ చేసి పిల్లలతో గడిపిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సమంత లోని ఈ కోణం చూసి నెటిజన్లు భేష్ సామ్.. అక్కినేని కోడలిగా యువర్ గ్రేట్ అంటున్నారు.

    సమంత సినీ జర్నీ

    ఇటీవలే ఓ బేబీ సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న సమంత.. మరికొద్ది రోజుల్లో 96 రీమేక్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సమంత ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. సమంత సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

    English summary
    Tollywood star heroine Samantha Akkineni creating buzz in tollywood. She running a social work organisation with the name of Pratyusha Support. Now she shared a pic with childrens who helped by that Organaisation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X