»   » జెమినీ టైపే నా మాజీ లవర్.. లేకపోతే సావిత్రిలానే నా జీవితం కూడా నాశనం..

జెమినీ టైపే నా మాజీ లవర్.. లేకపోతే సావిత్రిలానే నా జీవితం కూడా నాశనం..

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Samantha Akkineni Speaks About Her Ex-Boyfriend

  వరుస సక్సెస్‌లతో సమంత అక్కినేని సంతోషంలో మునిగి తేలుతున్నది. 2018 సంవత్సరం తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో సమంతకు బాగా కలిసివచ్చింది. ఆమె నటించిన రంగస్థలం, మహానటి, ఇరంబు తిరై చిత్రాలు ఘన విజయాలను సాధించిపెట్టాయి. ఈ చిత్రాల్లో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. సమంత ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మాజీ ప్రియుడి గురించి ప్రస్తావించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

  నా మాజీ ప్రియుడు కూడా జెమినీ

  నా మాజీ ప్రియుడు కూడా జెమినీ

  నా జీవితంలో ఒకరితో సన్నిహితంగా మెదిలాను. నా మాజీ ప్రియుడు మహానటిలో జెమినీ గణేషన్ లాంటి వాడు. అతడి ప్రవర్తన ముందే కనిపెట్టి జాగ్రత్త పడ్డాను. లేకపోతే నేను పెద్ద ప్రమాదంలో పడేవాడిని అని సమంత వెల్లడించారు.

  తీరని మానసిక క్షోభకు..

  తీరని మానసిక క్షోభకు..

  నా ప్రియుడి వ్యవహారం చాలా సందేహాత్మకంగా ఉండేది. సావిత్రి మాదిరిగా నేను చేసివుంటే నా జీవితంలో తీరని మానసిక క్షోభను అనుభవించేదానిని. నేను అతడి గురించి ముందుగానే జాగ్రత్త పడటం అదృష్టంగా భావిస్తాను. అతడితో తెగతెంపులు చేసుకోవడం నాకు మేలు జరిగింది అని సమంత పేర్కొన్నారు.

  చైతూ అద్బుతమైన వ్యక్తి

  చైతూ అద్బుతమైన వ్యక్తి

  నా జీవితంలో నాగచైతన్య ప్రవేశించడం దేవుడి వరంగా భావిస్తాను. చైతూ మంచి మనసు ఉన్న అద్బుతమైన వ్యక్తి అని సమంత ప్రశంసలతో ముంచెత్తారు. జెమినీ గణేషన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోవడం ద్వారా మహానటి సావిత్రి జీవితం నాశనమైన సంగతి తెలిసిందే.

  హీరో సిద్దార్థ్‌తో డేటింగ్

  హీరో సిద్దార్థ్‌తో డేటింగ్

  సమంత తాజా ఇంటర్వ్యూలో తన మాజీ ప్రియుడి పేరు ఎత్తకపోవడంతో ఆయన ఎవరనే చర్చ సినీవర్గాల్లో మొదలైంది. గతంలో సిద్దార్థ్‌తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు మీడియాలో షికారు చేశాయ. దాదాపు రెండున్నరేళ్లపాటు వారి మధ్య అఫైర్ సాగినట్టు తెలిసిందే. వారి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో వారి ప్రేమ పెళ్లి పీటల వద్దకు రాలేకపోయిందని చెప్పుకొంటారు.

  సిద్ధార్థ్‌కు గుడ్‌బై అలా..

  సిద్ధార్థ్‌కు గుడ్‌బై అలా..

  సమంతను పెళ్లి చేసుకోవడం సిద్ధార్థ్‌కు ఇష్టం లేదట. కానీ సమంత అతడిని మాత్రం వివాహం చేసుకోవాలనే కోరిక ఉండేదట. అయితే సమంత అంటే సిద్దార్థ్ చెప్పలేనంత ఇష్టం ఉండేదట. కొంత మేర అనుమానంగా చూడటం మొదలుపెట్టిన తర్వాత సిద్ధార్థ్‌కు గుడ్‌ బై చెప్పినట్టు ఇండియా టుడే వెబ్‌సైట్ ఈ కథనంలో పేర్కొన్నది.

  English summary
  Samantha, in a recent interview with a Telugu daily, spoke about her ex-boyfriend. She compared him to Gemini Ganesan's character from Mahanati (Nadigaiyar Thilagam in Tamil). She said, "Even I would have fallen into such crisis in my personal life like Savitri did. But thankfully I realised it in the beginning and walked out of the relationship as soon as I sensed that it could end up bad.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more