twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లైంగిక వేధింపులపై సమంతకు నెటిజన్ల ఝలక్.. అప్పుడెందుకు మాట్లాడలేదని..

    |

    లైంగిక వేధింపులపై పోరాటానికి తెర లేచిన మీటూ ఉద్యమంలో గాయని చిన్మయి శ్రీపాద భాగమయ్యారు. ప్రముఖ సినీ రచయిత వైరముత్తు తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆమె ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సంచలనం రేపిన చిన్మయి వ్యాఖ్యలను హీరోయిన్ సమంత సమర్థించింది. చిన్మయికి మద్దతు తెలిపిన సమంతపై కొందరు నెటిజన్లు విరుచుకుపడగా, మరికొందరు సానుభూతి తెలిపారు.

    వైరముత్తు అబద్దాల కోరు.

    వైరముత్తు అబద్దాల కోరు.

    వైరముత్తు ఓ అబద్దాల కోరు. తనను, తన తల్లిని లైంగికంగా వేధించాడు. తనకు సహకరించమని వెంటపడ్డాడు. నాపైనే కాకుండా మరికొందరు మహిళలను వేధించాడు. చెత్త కోరికలు కోరి వారిని ఆవేదనకు గురిచేశాడు అని చిన్మయి ఆరోపణలు చేసింది.

    Recommended Video

    Chinmayi Posts On Raghu Dixit & OS Thyagarajan's Behaviour
     చిన్మయికి బాసటాగా సమంత

    చిన్మయికి బాసటాగా సమంత

    చిన్మయి ఆవేదనపై స్పందించిన సమంత ట్వీట్టర్‌లో ఓ మెసేజ్‌ను పెట్టి సపోర్ట్‌గా నిలిచింది. మీరు నాకు పదేళ్లుగా తెలుసు. మీరు ఎంత నిజాయితీగా ఉంటారో నాకు తెలుసు. మీ బాధను నేను సరిగా అర్ధం చేసుకొన్నాను అని రాహులు రవీంద్రన్, చిన్మయికి బాసటాగా సమంత నిలిచింది. ఇలా సమంత పెట్టిన ట్వీట్‌పై నెటిజన్లు రఫాడారు.

    అప్పుడే ఎందుకు మాట్లాడలేదు.

    అప్పుడే ఎందుకు మాట్లాడలేదు.

    సమంత నీవు గొప్ప ప్రతిభావంతురాలైన నటివి. ఇప్పుడు వారికి బాసటగా నిలుస్తున్నావా? వాళ్లు బయటపెట్టనప్పుడు ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడలేదు. ఆమె లైంగిక వేధింపులకు గురైనప్పుడు ఎందుకు మాట్లాడలేదు. ఒకవేళ తనుశ్రీ ఇలాంటి దుర్మార్గాలను బయటపెట్టకపోతే మీరు నోరు మూసుకొని ఉండేవారా? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు.

    13 ఏళ్ల తర్వాత మద్దతా?

    13 ఏళ్ల తర్వాత మద్దతా?

    13 ఏళ్ల తర్వాత మద్దతు తెలుపుతావా? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు. ఇప్పుడు దానిని బయటకు తీసి రచ్చ చేయాల్సిన అవసరం ఏమున్నది అంటూ సమంతను మరో నెటిజన్ నిలదీశాడు.

    నీ కూతురుకు ఏం చెబుతావని

    నీ కూతురుకు ఏం చెబుతావని

    మీ టూ అంటే ఏమిటని నా కొడుకు అడిగితే సినీ పరిశ్రమలోని మహిళకు రిటైర్మెంట్ ఇన్సూరెన్స్ అని చెప్పాను. అది ఎలా అవుతుందని అమాయకంగా అడిగిన ప్రశ్నకు.. కెరీర్ అయిపోయిన తర్వాత ఇలాంటి ఇన్సురెన్స్ ప్లాన్ బయటకు తీస్తారు. వాటిని బర్ఖాదత్, అర్నబ్ కవర్ చేస్తారని చెప్పాననని ఓ నెటిజన్ పేర్కొనగా.. నీ కూతురుకు ఎలా, ఏం చెబుతావు అని సమంత ధీటుగా జవాబిచ్చింది.

    బాలీవుడ్‌లో తనుశ్రీ రచ్చ రచ్చ

    బాలీవుడ్‌లో తనుశ్రీ రచ్చ రచ్చ

    ప్రముఖ నటుడు నానా పాటేకర్ లైంగికంగా వేధించారని ఆరోపణలు చేస్తూ నటి తనుశ్రీ దత్తా చేసిన ఫిర్యాదుపై మహారాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. 2008లో హార్న్ ఓకే ప్లీజ్ అనే సినిమా షూటింగ్‌లో తనను చెప్పరాని చోట తాకుతూ, అసభ్యకరమైన నృత్యాలు చేయాలని లైంగికంగా వేధించారని ఇటీవల నానా పాటేకర్‌పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో నానా పాటేకర్ చుట్టు కేసు వల బిగుసుకొంటున్నట్టు కనిపిస్తున్నది. ఇదే దారిలో మరికొందరు ప్రముఖుల పేర్లు బయటకు రావడం గందరగోళంగా మారింది.

    English summary
    Actor Samantha Akkineni was one of the first people to stand up for singer Chinmayi when she had accused lyricist Vairamuthu of sexual harassment. Samantha Akkineni responds to being trolled for supporting singer Chinmayi who called out lyricist Vairamuthu for sexual harassment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X