»   » సమంత,అనుష్క ..ఇద్దరూ ఒకే టైప్ సినిమాలో...

సమంత,అనుష్క ..ఇద్దరూ ఒకే టైప్ సినిమాలో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టార్ హీరోయిన్స్ గా వెలుగుతున్న సమంత, అనుష్క ఇద్దరూ ఒకే తరహా చిత్రాలలో కనిపించనున్నారు. ఈ విషయాలని వారే ఖరారు చేసి చెప్పారు. సమంత తను తన తాజా చిత్రం 24 ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయం చెప్తే , అనుష్క మరో చిట్ చాట్ లో ఇదే విషయం తెలియచేసింది. ఇంతకీ ఇద్దరూ చేయబోయే జానర్ ..ధ్రిల్లర్.


అనుష్క...ఈ మద్యనే భాగమతి అనే చిత్రం కమిటైన సంగతి తెలిసిందే. యువి క్రియేషన్స్ పతాకంపై పిల్ల జమీందార్ అశోక్ డైరక్షన్ లో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం గురించి అంతా పదహారో శతాబ్దంలో హైదరాబాద్ ప్రాంతాన్ని ఏలిన మహమ్మద్ కులీ కుతుబ్‌షా, ఆయన భార్య భాగమతిల ప్రేమ ఆధారంగా కథ రూపొందుతుంది అనుకున్నారు.

అయితే ఈ వార్త నిజం కాదని అనుష్క చెప్పింది. నిజానికి ఇది ఓ థ్రిల్లర్ సినిమా అని అనుష్క చెప్పింది. ఈ సినిమాలో 'భాగమతి' అనే అమ్మాయి జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఓ థ్రిల్లర్ సినిమాగా రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం.

Samantha, Anushka's next is Thriller

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే చివరి వారంలో ప్రారంభమవుతున్నట్లు సమాచారం. ఈ సినిమా కి 'పిల్ల జమీందార్' ఫేం అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు. మిగతా నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

మరో ప్రక్క సమంత దృష్టి ..ఓ కన్నడ థ్రిల్లర్ పై పడింది. గత కొద్ది కాలంగా ఆమె ఈ సినిమా గురించి ట్వీట్స్ సైతం చేస్తోంది. ఆ మధ్యన నాగచైతన్య తో కలిసి బెంగుళూరు వెళ్లి మరీ ఈ సినిమా చూసి వచ్చింది. ఆ సినిమా మరేదో కాదు..యు టర్న్.

సమంత మాట్లాడుతూ.. నా మనసు థ్రిల్లర్‌ కథలపైకి మళ్లింది. అందుకే కన్నడ చిత్రం 'యూ టర్న్‌' రీమేక్‌లో నటించాలని నిర్ణయించుకొన్నా. తెలుగు, తమిళ భాషల్లో ఆ చిత్రం రాబోతోంది అని చెప్పింది. అందుతున్న సమాచారం ప్రకారం సమంత ప్రొడ్యూస్ చేస్తోంది ఈ చిత్రాన్ని. ఈ సినిమాలో ఆమె ఇన్విస్టిగేటివ్ జర్నలిస్ట్ గా కనిపించనుంది.

English summary
Samantha will be seen as an investigative journalist in remake of a Kannada film U-Turn, Touted to be a racy thriller, which will be directed by Pawan Kumar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu