»   » పెళ్ళితర్వాత సమంతా మొదటిసినిమా ఇదే?: క్రికెటర్ బయోపిక్ లో ఇండియన్ కేప్టెన్‌గా?

పెళ్ళితర్వాత సమంతా మొదటిసినిమా ఇదే?: క్రికెటర్ బయోపిక్ లో ఇండియన్ కేప్టెన్‌గా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
క్రికెటర్ బయోపిక్ లో సమంత Samantha in Mithali Raj Biopic

ప్రస్తుతం బయోపిక్ ల హవా నడుస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా క్రీడాకారుల జీవిత చరిత్రలు బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నాయి. ఈ విషయంలో ఇప్పుడు బాలీవుడ్ దుమ్మురేపుతుందనే అనాలి. ఇక ఇప్పటికే భాగ్ మిల్కా భాగ్, మేరీకామ్, ఎంఎస్ ధోని లాంటి బయోపిక్స్ కోట్ల రూపాయలు కొల్లగొట్టడమే కాకుండా కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టాయి. ఈ ట్రెండ్ ప్రస్తుతం కంటిన్యూ అవుతూనే.. అమిర్ ఖాన్ 'దంగల్', క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ బయోపిక్ లు సంచలనాలు సృష్టించి ఇలాంటి సినిమాలమీద నమ్మకం పెంచాయ్..

ఇప్పుడు భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ జీవితంపై కూడా సినిమా రూపొందబోతోంది. ప్రపంచంలో 6వేల పరుగులు పూర్తి చేసిన ఏకైక మహిళా క్రికెటర్ గా చరిత్ర పుస్తకాల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న మిథాలీ రాజ్ లైఫ్ ను.. ఇప్పుడు బయోపిక్ గా రూపొందించనుండగా.. వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది.

Samantha as Criketer in Mithali Raj Biopic

గతంలో ఇదే సంస్థ మేరీకోమ్ జీవితాన్ని ప్రియాంక చోప్రాతో తీసిన సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ ను కన్ఫాం చేస్తూ.. తనపై సినిమా వస్తోందని మిథాలీ స్వయంగా అనౌన్స్ చేసింది. అయితే.. ఒకేసారి పలు భాషల్లో రూపొందబోయే చిత్రంలో.. సౌత్ బ్యూటీ.. అక్కినేని వారింటి కాబోయే కోడలు సమంత నటించబోతోందనే న్యూస్ ఒకటి ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.

పెళ్లి తర్వాత అంటే అక్కినేని వారింటి కోడలుగా సమంత మారిన తర్వాత.. ఆమె నటించబోయే తొలి చిత్రం ఇదే అని అంటున్నారు. నేషనల్ వైడ్ గా పలు భాషల్లో మిథాలీ బయోపిక్ రూపొందనుండగా.. బాలీవుడ్ .. సౌత్ భాషల్లో వేర్వేరు నటులతో రూపొందిస్తారా లేక.. సౌత్ కోసం సమంతను తీసుకున్నారా అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

    English summary
    latest news is Roaming in Tollywood circles that Samantha goaing to be play a Cricketer roale in a Biopic on Mithali Raj
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu