»   » నాగేశ్వరరావు గురించి సమంత పిచ్చి పిచ్చిగా!

నాగేశ్వరరావు గురించి సమంత పిచ్చి పిచ్చిగా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా లెజెండ్, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గురించి తెలియని తెలుగు వారు ఎవరైనా ఉంటారా? దాదాపుగా ఉండరు. తాజాగా మనం సినిమాలో ఈ నాగేశ్వరరావుకు సంబంధించి ఆసక్తికరమైన సీన్ ఉంది. అదేమిటో క్రింద వీడియోలో చూడండి.

అక్కినేని మూడు తరాల హీరోలు నటించిన మల్టీ స్టారర్ మూవీ 'మనం' చిత్రం ఈ నెల 23న విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు నటించి చివరి సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం ద్వారా అక్కినేని ఎప్పటికీ జీవించే ఉంటారని నాగార్జున అంటున్నారు.

Samantha asks Who is Nageswara Rao?

కాగా...'మనం' చిత్రం ఆడియో ఎలాంటి ఆర్భాటాలు, వేడుక లేకండా డైరెక్టుగా మార్కెట్‌లోకి విడుదల చేసారు. 'మనం' ఆడియో పంక్షన్ గ్రాండ్ గా చేస్తారని,ప్యాన్స్ అంతా వెళ్లవచ్చని భావించారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు మరణించిన ఇంకా సంవత్సరం కూడా గడవకముందే ఇలాంటి పంక్షన్ జరుపుకోవటం పద్దతి కాదని, తాను స్టేజిపై ఎమోషన్ అయ్యే అవకాసం ఉందని భావించిన నాగార్జున ఫంక్షన్ ని రద్దు చేసుకున్నారని తెలుస్తోంది.

అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రీయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/9n5fKJXZPhY?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Manam is an upcoming Telugu comedy drama directed by Vikram Kumar. The film stars the late Nageswara Rao, Nagarjuna and Naga Chaitanya along with Shriya Saran and Samantha.The film's dialogues will be written by Harshavardan, while Anoop Rubens will handle music. Principal shooting of the film began on 7 June 2013. Manam will be the last film of Nageswara Rao who died during the production phase of the film in January 2014.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu