»   » సమంత సొగసు చూడ తరమా...!(ఫోటోలు)

సమంత సొగసు చూడ తరమా...!(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరబాద్: సొగసు చూడ తరమా...అంటూ ఓ కవి స్త్రీ సౌందర్యాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించిన వైనాన్ని సినిమాల్లో చూసాం. ఇప్పటి వరకు ఎంతో మంది అందమైన హరోయిన్లు ఇప్పటి వరకు తమ సొగసుతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ సమంత తన సొగసుతో హవా నడపిస్తోంది తెలుగు సినీ ఇండస్ట్రీలో....

ఇప్పటికే తన అందచందాలు, పర్ఫార్మెన్స్‌కు తోడు సక్సెస్ రేటుతో ఇండస్ట్రీలో నెం.1 హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమంత.....'అత్తారింటికి దారేది' చిత్రం భారీ విజయం సాధించడంతో మరింత జోష్ మీద ఉంది. సినిమా విడుదలై 25 రోజులు పూర్తయిన నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ మీట్లో సమంత.....ఎంతో అందంగా ముస్తాబై హాజరై అందరి మతులు పోగొట్టింది.

సక్సెస్ మీట్లో సమంత అందచందాలు, హావ భావాలు ఏ రేంజిలో ఉన్నాయో......మే చెప్పడం కన్నా, మీరు చూస్తేనే బెటర్. స్లైడ్ షోలో సమంతకు సంబంధించిన ఫోటోలు, ప్రెస్ మీట్ వివరాలు

25 రోజులు పూర్తి చేసుకున్న AD

25 రోజులు పూర్తి చేసుకున్న AD


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సమంత, ప్రణీత హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘అత్తారింటికి దారేది' చిత్రం విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకుంది.

నిర్మాత మాట్లాడుతూ..

నిర్మాత మాట్లాడుతూ..


సినిమా విడుదలకు ముందుకు ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. పైరసీకి గురైనా రికార్డు స్థాయి వసూళ్లు దక్కించుకోవడం ఆనందంగా ఉంది అని అన్నారు నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్.

100 కోట్లు వస్తాయేమో?

100 కోట్లు వస్తాయేమో?


ఈ చిత్రం ఇప్పటికే 70 కోట్లకు పైగా వసూలు చేసి ఇప్పటి వరకు వసూళ్ల పరంగా ఉన్న నెం.1 స్థానంలో ఉన్న ‘మగధీర'ను బీట్ చేసింది. 25 రోజులకే ఇంత వసూలు చేసిందంటే....త్వరలోనే 100 కోట్లు వసూలు చేస్తుందనే నమ్మకంతో ఉన్నారంతా.

సమంత మాట్లాడుతూ..

సమంత మాట్లాడుతూ..


50 రోజుల్లో రావాల్సిన వసూళ్లు...25 రోజుల్లోనే వచ్చాయి. ఇలాంటి సినిమాలో నేనూ భాగమైనందుకు ఆనందంగా ఉంది అని సమంత చెప్పుకొచ్చింది.

పవన్ అభిమానిని నేను..

పవన్ అభిమానిని నేను..


నేను పవన్ కళ్యాణ్ కు అభిమానిని. ఇటీవల థాంక్యూమీట్లో పవన్ నన్ను మెచ్చుకున్నారు. అదే నాకు వచ్చిన పెద్ద అవార్డుగా భావిస్తాను. సినిమాలో కోసం అందరూ పడిన కష్టానికి తగిన ఫలితం దక్కిందని సమంత వెల్లడించింది.

అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్‘అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
Atharintiki Daaredi 25 days press meet held in Hyderabad. Heroine Samantha, Producer BVSN Prasad attend this event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu