twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ వ్యాధిపై పోరాటం ప్రకటించిన సమంత

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : హీరోయిన్ సమంత వరుస సినిమాలతో బిజీగా ఉన్నా...మరో వైపు చారిటీ కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటోంది. ప్రస్తుతం ప్రజలను పట్టిపీడిస్తున్న అనేక వ్యాధులలో హిమోఫిలియా ఒకటని, పిల్లలను వేధించే సమస్యగా ఇది కలవర పెడుతోందని, పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని నటి సమంత తెలిపారు.

    హిమోఫిలియా సొసైటీ ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. సమంత మాట్లాడుతూ ఈ వ్యాధి గురించి విన్నప్పుడు తానెంతో బాధపడ్డానని, నావంతు సాయంగా ఈ పోరాటంలో పాలుపంచుకుంటానని, ప్రతి ఒక్కరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలని ఆమె తెలిపారు. తాను దర్శకత్వం వహించే చిత్రంలో ఓ పాత్రను హిమోఫిలియా పేషెంటుగా చిత్రీకరించి సమాజానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తానని దర్శకురాలు నందినీరెడ్డి అన్నారు.

    సిద్ధార్థ, సమంత జంటగా 'అలా మొదలైంది' దర్శకురాలు బి.వి నందినిరెడ్డి దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా డేట్స్ విషయంలో సమంత, బెల్లంకొండ విషయంలో పెద్ద గొడవ జరగడం, ఫిర్యాదుల వరకు వెళ్లిన విషయం తెలిసిందే.

    యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. కందిరీగ, కాంచన, బాడీగార్డ్ వరుస హిట్లు కొట్టిన బెల్లంకొండ నిర్మాత బెల్లకొండ ఈ సినిమాను విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. సమంత ప్రస్తుతం మహేష్ బాబు సరసన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె' చెట్టు చిత్రంతో పాటు, నాగ చైతన్య సరసన 'ఆటో నగర్ సూర్య', నానితో 'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రంలో నటిస్తోంది.

    English summary
    In a drive to support children suffering from hemophilia, an NGO conducted an awareness camp where our beauty Samantha is the chief guest. The actress says that she is all happy to be part of this programme and promised to work for such children by creating awareness everywhere.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X