»   »  2016 : ఎటు చూసినా సమంత..

2016 : ఎటు చూసినా సమంత..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చూస్తూంటే 2016 అంతా సమంతానే కనిపించేటట్లు ఉంది. ఇది సమంత అభిమానులకి నిజంగా పండగే ఎందుకంటే తను నటిస్తున్న, నటించబోతున్న నాలుగు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. అవి వరుసగా మహేష్, నితిన్, సూర్యా, ధనుష్. ఇంకెన్ని ఒప్పుకుంటుంటుందో తెలియదు. కేవలం తన ప్లానింగ్ తో ఎక్కడా డేట్స్ క్లాష్ రాకుండా జాగ్రత్తపడుతూ వరస పెద్ద ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉంది.

సమంత ప్రస్తుతం అనసూయ రామలింగం వర్సెస్‌ ఆనంద విహారి (అ..ఆ) సినిమాతో బిజిగా ఉంది. దీనిలో నితిన్ సరసన నటిస్తోంది. త్రివిక్రమ్‌ బ్రాండ్‌తో తెరకెక్కుతున్న ఓ చక్కని ప్రేమకథ ఈ సినిమా అని తెలిపారు. గతంలో త్రివిక్రమ్ తో అత్తారింటికి దారేది సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం'. ప్రస్తుతం ఊటీలో షూటింగ్ జరుపుకుంటోంది. దీన్ని తెలుగు, త‌మిళ్ లో పి.వి.పి సంస్థ భారీ బడ్జెట్ తో రూపొందిస్తుంది. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత ఒక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా హైదరాబాద్ కి షిప్ట్ అవ్వగానే సంమంతా షుటింగ్ లో జాయిన్ అవ్వడానికి సిద్ద పడుతోంది. ఇందులో కాజ‌ల్, ప్రణీత కూడా న‌టిస్తున్నారు.

Samantha busy with four Moives

2డి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నటుడు సూర్య నిర్మిస్తున్నాసినిమా 24, దీనిలో సూర్య హీరోగా నటిస్తున్నాడు. ఈసినిమాకి డైరక్టర్ విక్రమ్‌ కుమార్‌ ఈ సినిమాలో సమంత ముఖ్యమైన క్యారక్టర్ లో నటిస్తోంది. ఇందులో మరోక హీరోయున్ నిత్య మేనన్‌ల నటిస్తోంది.

తమిళ నటుడు విజయ్‌ కథానాయకుడుగా తమిళంలో తెరకెక్కుతున్న థేరి చిత్రంలో సమంత నాయికగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కి భారీ స్పందన వచ్చింది. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. అమి జాక్సన్‌ మరో నాయికగా నటిస్తున్నారు.మొత్తానికి వరుస చిత్రాలతో సమంత అభిమానులని ఆకట్టుకోనున్నారు.

    English summary
    Samantha Ruth Prabhu tweeted:" 4 movies releasing first half of 2016.. So much to look forward too"
    Please Wait while comments are loading...