»   » ఇన్నర్ వేర్ యాడ్: క్లారిటీ ఇచ్చిన సమంత

ఇన్నర్ వేర్ యాడ్: క్లారిటీ ఇచ్చిన సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ సమంత ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ హోదాలో ఉంది. ఆమెతో కాంపెయిన్ చేయించేందుకు పలు కార్పొరేట్ సంస్థలు, షాపింగ్ మాల్స్, ఇతర వస్తూత్పత్తి సంస్థలు పోటీ పడుతున్నాయి. భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుని ఇప్పటికే పలు బ్రాండ్లకు ప్రచారం చేస్తున్న సమంత....త్వరలో ఇన్నర్‌వేర్(లోదుస్తులు) బ్రాండ్ తరుపున ప్రచారం చేయనుందన వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన సమంత అలాంటిదేమీ లేదని వివరణ ఇచ్చింది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సమంత సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం ఆమె తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్, బన్నీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రంలో నటిస్తోంది. శ్రీనువైట్ల-రామ్ చరణ్ ప్రాజెక్టులోనూ ఆమెనే హీరోయిన్‌గా తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆ చిత్రానికి రచయితగా పని చేస్తున్న కోన వెంకట్ ఇటీవల స్పష్టం చేసారు. వీటితో పాటు తమిళంలో ఓ రెండు సినిమాల్లో నటిస్తోంది.

Samantha clarified that she isn’t endorsing any Innerwear brand

వేసవిలో ‘సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా కనిపించనున్నారు. బన్నీ సృష్టించే పెళ్లి సందడి.. వినోదాలు పంచనుంది. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ శివార్లలో ప్రత్యేకంగా ఓ సెట్‌ వేశారు. కీలకభాగం చిత్రీకరణ అక్కడే జరిగింది. ఇందులో అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా కనిపిస్తాడనీ, సినిమా అంతా పెళ్లి సందడి మధ్య సాగుతుందని తెలుస్తోంది. రాజేంద్రప్రసాద్‌, ఉపేంద్ర, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈచిత్రంలో సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, రావ్ రమేష్ నటిస్తున్నారు.

మలయాళంలో విజయవంతమైన బెంగళూరు డేస్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందులో సిద్దార్థ్, సమంతా కలిసి నటించబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదంటోంది సమంత. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు.

English summary
Tamil daily has reported that Samantha will soon appear in an Innerwear advertisement. Most of the movie lovers were thrilled with the news of Innerwear advertisement and they are excited to see her in this commercial. However, Samantha has quickly clarified that she isn’t endorsing any Innerwear brand.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu