»   » మహేష్ బాబు సినిమా పోస్టర్‌పై సమంత ఆగ్రహం

మహేష్ బాబు సినిమా పోస్టర్‌పై సమంత ఆగ్రహం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న '1-నేనొక్కడినే' చిత్రంపై అంచనాలు రోజురోజకు పెరిగి పోతున్నాయి. ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు ఏవి రిలీజ్ చేసినా.....రెస్పాన్స్ అద్భుతంగా వస్తోంది. అయితే ఆఢియో రిలీజ్ సందర్భంగా ఇటీవల రిలీజ్ చేసిన ఓ పోస్టర్ కాస్త వివాదాస్పదంగా మారింది. ఈ పోస్టర్ మహిళలను చిన్నచూపు చూసే విధంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మహేష్ బాబు బీచ్‌లో నడుస్తుంటే...హీరోయిన్ క్రితి సానన్ అతని కాలి అడుగులను ఫాలోఅవుతూ మోకాళ్లు, చేతులతో పాకుతూ ఉండటం విమర్శలు వస్తున్నాయి. ఆడది మగాడి కాళ్ల వద్ద బానిస అనే అర్థం వచ్చేలా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. హీరోయిన్ సమంత కూడా ఈ పోస్టర్‌ను విమర్శిస్తూ పరోక్షంగా తన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కామెంట్స్ చేసింది.

Samantha comment on 1-Nenokkadine poster

'1-నేనొక్కడినే' చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రితి సానన్ హీరోయిన్. ఈ చిత్రం ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతం బాలనటుడిగా తెరంగ్రేటం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

English summary
The latest poster of 1-Nenokkadine (above pic) has Mahesh Babu walking on a beach and heroine Kriti Sanon follows his foot marks walking on her four limbs like a dog. The poster reflects that a woman is slave to a man. Director Sukumar might have designed this poster as per the concept of 1-Nenokkadine.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu