»   » దేవిశ్రీ ప్రసాద్ ప్రసాద్ సినిమాలో హీరోయిన్ ఎవరు?

దేవిశ్రీ ప్రసాద్ ప్రసాద్ సినిమాలో హీరోయిన్ ఎవరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆయన్ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా నిర్మించబోతున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనునప్నారు. దిల్ రాజు ఈ విషయాన్ని ఆ మధ్య అఫీషియల్ గా ప్రకటించారు. మార్చిలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఈ చిత్రంలో హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దేవికి సరిగ్గా సరిపోయే హీరోయిన్ సమంతే అని ఫిక్స అయ్యారట. ఈ మేరకు సమంతతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే సమంత ఒప్పుకుంటుందా? లేదా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. దిల్ రాజు, సుకుమార్, రత్నవేలు లాంటి టాప్ టెక్నీషియన్లు ఉండటంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Samantha confirmed for Devi Sri Prasad ?

ఇటీవల ఇంటర్వ్యూలో దేవిశ్రీ మాట్లాడుతూ... హీరోగా నటించమని అవకాశాలు కూడా వస్తున్నాయని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయని తెలిపారు. దిల్ రాజు గారు, అశ్వినీ దత్ గారు, అల్లు అరవింద్ గారు, తమిళంలో థాను, జ్ఞానవేల్ రాజాగారు ఇలా చాలా మంది అడుగుతున్నారు. అయితే వింటున్న కథల్లో నాకు బాగా నచ్చితేనే చేయాలని ఉంది.

మన ఇండస్ట్రీలో ఇప్పటికే మంచి స్టార్స్ ఉన్నారు. హీరోగా నటించి ఏదో చేయాలని కాదు. మ్యూజిక్ షోలు ఇవ్వడం వల్ల ప్రేక్షకుల్లో ఓ ఇమేజ్ ఏర్పడింది. నా బాడీ లాంగ్వేజ్ అందరికీ తెలుసు. నా బాడీ లాంగ్వేజ్ కి తగిన కథ వస్తే చేస్తాను. నా సినిమాలకు నేనే మ్యూజిక్ ఇస్తాను అన్నారు.

English summary
According to reports, the makers have approached actress Samantha as the female lead opposite Devi Sri Prasad debut.
Please Wait while comments are loading...