For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మాది తప్పుడు సంబంధం కాదు : సమంత

  By Bojja Kumar
  |

  హైదరాబాద్ : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో తన వరుస విజయ పరంపరల ఖాతాలో మరో సక్సెస్‌ను చేర్చుకున్న సమంత.....ఈ మధ్య ఓ ఆసక్తికర విషయంతో వార్తల్లో నానుతూ వస్తోంది. సమంతకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతను మరెవరో కాదు...ఆమెతో పాటు ప్రస్తుతం 'జబర్దస్త్' చిత్రంలో నటిస్తున్న సిద్ధార్థే అని ఆ వార్తలు సారాంశం. అయితే సమంత మాత్రం ఈ విషయం ప్రస్తావించినా చిర్రెత్తి పోతోంది. తనకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరని....సిద్ధార్థ తనకు మంచి స్నేహితుడు మాత్రమే అని కుండ బద్దలు కొట్టినట్లు ఖరాకండిగా చెప్పేస్తోంది.

  సమంత-సిద్ధార్థల చుట్టూ ఇలాంటి గాసిప్స్ చక్కర్లు కొట్టడానికి కారణం ఇటీవల ఈ ఇద్దరు కలిసి యూఎస్‌లో హాలిడే ట్రిప్ గడపడమే అని సినీవర్గాల్లో చర్చ సాగుతోంది. ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేకుండానే కలిసి యూఎస్‌లో షికార్లు కొట్టారా? అని చాలా మంది మనసులో మొలుస్తున్న ప్రశ్న. అయితే వారందరికీ తనదైన రీతిలో సమాధానం చెబుతోంది సమంత.

  ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రికతో సమంత మాట్లాడుతూ...''సిద్ధార్థ నా సహ నటుడు. అంతకు మించి మంచి స్నేహితుడు. మేము చాలా సన్నిహితంగా ఉంటాము, కానీ మా మధ్య తప్పుగా ఊహించుకోవడానికి ఏమీ లేదు'' అని వెల్లడించింది. 'ఇలాంటి అర్థం పర్థం లేని గాలి వార్తలకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ప్రేమ అనేది పూర్తిగా పర్సనల్ అని నేను నమ్ముతాను. ఇలాంటి వారిపై ఇతరులు కలుగజేసుకోక పోవడమే మంచిది' అని చురకలంటించింది.

  వీరిద్దరు కలిసి నటిస్తున్న జబర్దస్త్ సినిమా విషయానికొస్తే...

  నందిని రెడ్డి దర్శకత్వం లో హీరో సిద్దార్థ మరియు సమంత జంటగా 'జబర్దస్త్' సినిమా రూపొందుతోంది. శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'జబర్దస్త్' చిత్రాన్ని దర్శకుడు లింగుసామి తమ తిరుపతి బ్రదర్స్ బ్యానర్ పై తమిళంలోకి అనువదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అనువాదపు హక్కులను ఆయన సొంతం చేసుకున్నారు. తమిళంలో దీనికి 'డుం డుం పీ పీ' అనే టైటిల్ ఖరారు చేశారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

  సమంతా, నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగు ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంగీతం : థమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బి .మహేంద్రబాబు, నిర్మాత : బెల్లంకొండ సురేష్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : బి.వి.నందినిరెడ్డి.

  English summary
  Actress Samantha, who is basking on the success of her movie Seethamma Vakitlo Sirimalle Chettu, was recently in news after she revealed that she has a boyfriend. Now, the buzz in the T-Town is that she is dating actor Siddharth, who is her co-star in the upcoming movie Jabardasth. But the dusk beauty has slammed the rumours saying that they are good friends and co-star.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X