సిద్దార్ధతో లవ్ మ్యాటర్ పై మరోసారి సమంత
కొంతకాలంగా సమంత, సిద్ధార్థలమధ్య లవ్ ఎఫైర్ నడుస్తున్నదంటూ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్, సమంత ఆ విషయాలను ఖండిస్తున్నా, వాటి ప్రచారం మాత్రం ఆగలేదు. ఇంతేకాక త్వరలో వాళ్లిద్దరూ పెళ్లిచేసుకోనున్నారన్న వార్తలుకూడా వినిపిస్తున్నాయి. అందుకని తాను ముందుకు వచ్చానని చెబుతూ సమంత పై విషయాలు చెప్పుకొచ్చింది.
సిద్ధార్థ్ తనకు మంచి మిత్రుడు మాత్రమేనని, అంతకుమించి ఎటువంటి ప్రేమాయణాలు తమ మధ్య లేవని, ఇప్పట్లో తనకు పెళ్లిచేసుకోవాలన్న ఆలోచన లేదని, వ్యక్తిగత విషయాలపై మీడియా ఉత్సాహం చూపించడం చాలా బాధాకరంగా ఉందని చెప్పింది. అయినా దాచుకోవాల్సినంత రహస్యమైన విషయాలు తన వద్దలేవని, జీవితంలో పెళ్లి అనేది తప్పనిసరి విషయమైనప్పుడు తన తల్లిదండ్రులు చూసిన అబ్బాయితోనే తన పెళ్లి జరుగుతుందని చెప్పుకొచ్చింది.
తన ఆలోచనలన్నీ ప్రస్తుతం సినిమాల చుట్టే తిరుగుతున్నాయని, వేరే విషయాలు ఆలోచించేంత తీరిక, ఓపిక లేవని స్పష్టం చేసింది. ఇంత చెప్పినా సిద్ధార్థ్ చెప్పిన విషయం మాత్రం ఆలోచించదగినదిగా ఉంది. తన స్వంత విషయాలు ఏవైనా సరే సమంతతో మాట్లాడే చనువు ఆమె దగ్గర వుందని, కానీ ప్రస్తుతం చెలరేగుతున్న పుకార్లు మాత్రం అందరికీ మంచిదికాదని సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. అయితే సమంతతో ప్రేమ సంగతి మాత్రం ఆయన ఖండించకపోవడం ఇక్కడ గమనార్హం.


Click it and Unblock the Notifications












