For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాబోయ్ అవంటే భయం:సమంత

  By Srikanya
  |

  హైదరాబాద్ : 'ఈగ' రూపంలో వచ్చిన ప్రేమికుడి ప్రతీకారానికి తన వంతు సాయం అందించిన యువతిగా 'ఈగ'లో అలరించింది సమంత. అందులో ఈగతో సంభాషణలు, అనుబంధం కొనసాగించిన ఆమెకు ... వాస్తవానికి బొద్దింక, బల్లిని చూస్తే ఆమడదూరం పరిగెడుతుందట. ఎప్పటికీ ఆ రెండూ తన కంటిలో పడకూడదని కోరుకుందట. అమ్మడికి మరో భయం కూడా ఉందట. దెయ్యం చిత్రాలను చూడటమేకాదు.. వాటి గురించి పుస్తకాల్లో చదవటం, వినటం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయనని చెప్తోంది.

  అలాగే ఇది వరకు డాన్స్ ల విషయంలో చాలా గందగోళంగా ఉండేది. ఎన్టీఆర్‌, మహేష్‌బాబు లాంటి హీరోలతో స్టెప్పులు వేసిన తరవాత వాటిపై అవగాహన వచ్చింది. డాన్స్ లపై మరింత దృష్టి పెడుతున్నా. మేం ఎంత చేసినా హీరోల వేగం ముందు తేలిపోవలసిందే అంటోంది సమంత. అనారోగ్యం నుంచి కోలుకున్న ఆమె కంటిన్యూగా షూటింగ్ లలో పాల్గొంటోంది. ఆమె నాగచైతన్యతో కలిసి చేస్తున్న'ఆటోనగర్‌ సూర్య'వేసిన స్టెప్స్ కు మంచి గుర్తింపు వస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తోంది.

  ఇక సినిమా అంటే ఏమీ తెలియని స్థితిలో ఈ రంగంలో అడుగుపెట్టాను. ఇప్పుడంతా తెలుసు.. అని చెప్పను. ప్రాథమిక విషయాలపై అవగాహన పెంచుకొంటున్నాను. నా దగ్గరకు వచ్చే ప్రతి దర్శకుడూ నన్ను కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేయడం నా అదృష్టం. ఫలానా సినిమాలో సమంత బాగా చేసిందీ... అని ఎవరైనా అంటే ఆ ప్రశంస నా దర్శకుల వల్లే దక్కిందని భావిస్తాను. వాళ్లు ఏం చెబితే అది చేస్తున్నాను. ఏ రంగంలో అయినా ఒక్క రోజులోనే అంతా సాధించలేం. నిరంతర విద్యార్థిలా ఉండడమే నాకిష్టం. మంచి విషయం ఎవరు చెప్పినా స్వీకరిస్తాను అంది.

  ప్రస్తుతం సమంత చిత్రాలు వరుసగా రెడీ అవుతున్నాయి. నాగచైతన్య' ఆటోనగర్‌ సూర్య',గౌతమ్‌ మీనన్‌ ' ఎటు వెళ్లిపోయిందో మనసు' త్వరలో విడుదల కానున్నాయి. నిర్మాతలకు ఆమె మీద పెట్టుబడి పెడితే లాభాలకు ఇబ్బంది ఉండదనే నమ్మకం ఆమెను తమిళ,తెలుగు భాషల్లో బిజీ చేస్తోంది. ప్రస్తుతం ఆమె మహేష్ సరనస చేస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,సిద్దార్ద సరసన నందినీ రెడ్డి దర్శకత్వం షూటింగ్ లోనూ రెగ్యులర్ గా పాల్గొంటోంది. అడపా దడపా ఆమె యాడ్ ఫిల్మ్ లు కూడా చేస్తోంది.

  English summary
  Samantha admits she has an irrational phobia of insects. She says, "To this day, people ask me about the cockroach - it was disgusting. I have a fear of bugs and It makes me sick thinking about it and, in the theatre, it was the same reaction."
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X