»   » మహానటి: హీరోయిన్ సమంత ఫస్ట్‌లుక్

మహానటి: హీరోయిన్ సమంత ఫస్ట్‌లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటి సావిత్రి జీవితంపై తెరకెక్కుతున్న 'మహానటి' చిత్రానికి సంబంధించి హీరోయిన్ సమంత ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ చిత్రంలో జర్నలిస్టు మధురవాణిగా కనిపించబోతున్న సామ్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'ఇలాంటి గొప్ప చిత్రంలో తాను భాగమైనందుకు ఆనందంగా ఉంది. నేను పోషించిన మధురవాణి పాత్ర అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను' అంటూ సమంత పేర్కొన్నారు.

70, 80ల్లో మాదిరిగా సమంత లుక్

సమంత ఇందులో ఫిల్మ్ జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో కనిపించబోతున్నారు. సావిత్రి మీద జర్నల్ రాసే జర్నలిస్టుగా సమంత నేరేషన్‌తో 'మహానటి' చిత్రం మొదలవుతుందని తెలుస్తోంది. అప్పటి కాలానికి తగిన విధంగానే సమంత‌ను ఒక డిఫరెంట్ లుక్‌లో ఇందులో ప్రజంట్ చేశారు.

సమంత వాడే టూవీలర్

ఈ చిత్రంలో సమంత ఈ వాహనం వాడుతూ కనిపించనున్నారు. 70, 80ల్లో వాడిన టూ వీలర్స్ ప్రస్తుతం వాడుకలో లేవు. సినిమా కోసం దీన్ని వెతికి మరీ రినోవేషన్ చేయించారు.

తొలిసారి డబ్బింగ్

తొలిసారి డబ్బింగ్

తన 8 ఏళ్లు కెరీర్లో సమంత ఎప్పుడూ డబ్బింగ్ చెప్పలేదు. 'మహానటి' సినిమా కోసం తొలిసారిగా సమంత తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రంలో మీ పాత్రకు మీరే డబ్బింగ్ చెబితే ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలుగుతుందని చెప్పి సమంతను ఒప్పించాడట.

మే 9వ తేదీన రిలీజ్

మే 9వ తేదీన రిలీజ్

వై జయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టైటిల్ పాత్రను కీర్తి సురేష్ పోషించారు. ఇంకా మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Samantha first look from Mahanati released. Samantha took to Twitter and wrote – “Really happy to be a part of such a wonderful film . I hope you love #Madhuravani as much as I loved being her #Mahanati VyjayanthiFilms nagashwin7 #MahanationMay9th.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X