For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇదీ సమంతా స్కూల్ ప్రోగ్రెస్‌ కార్డు: తమన్, హరీష్ శంకర్, లక్ష్మి మంచు వీళ్లంతా...

  By Srikanya
  |

  హైదరాబాద్‌: హీరోయిన్ సమంత చాలా సరదా మనిషి. ఖాళీ దొరికితే చాలు ప్రక్కనున్న వాళ్లతో సరాదాగా మాటలు కలిపి సందడి చేస్తుందని ఆమెతో పనిచేసిన వాళ్లు చెప్తారు. అది నిజమే అని ఆమె అబిమానులు కూడా అంటూంటారు. ఎలా వారికి తెలుసు అంటే ఆమె అప్పుడప్పుడూ తన సోషల్ నెట్ వర్కింగ్ ఖాతాలో చేసే అల్లరి చూసి. ఇప్పుడీ మ్యాటర్ అంతా ఎందుకు చెప్తున్నాను అంటారా...

  తాజాగా ఆమె తను చదువుకునేటప్పటి పోగ్రస్ రిపోర్ట్ కార్డ్ లను చూపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎప్పుడూ షూటింగ్ లు, ఈవెంట్స్ అంటూ బిజీగా ఉండే సమంత ఈ రోజు తన కుటుంబంతో గడిపింది. అఫ్ కోర్స్ ఆ విషయం కూడా ఆమె తన ట్విట్టర్ ఎక్కౌంట్ లో తెలియచేసిందనుకోండి.

  ఇక ఎలాగో ఇంట్లో ఉన్నాం కదా అనుకుందో లేక ఏం గుర్తు వచ్చిందో కానీ , అప్పటి పోగ్రస్ రిపోర్ట్ లు అన్ని వెతికి పట్టుకుని ఇదిగో మన ముందు పెట్టింది. చూస్తే సమంత అందం, నటనల్లోనే కాదు.. చదువులోనూ స్టారేనని తేలింది.

  ఇటీవల తల్లితో కలిసి తన చిన్నప్పటి ప్రోగ్రెస్‌ కార్డులు తిరగేసిన సమంత తన మార్కులు చూసి తానే ఆశ్చర్యపోయిందట. ఇంతకీ ఆమె పోగ్రస్ రిపోర్ట్ లలో ఎన్ని మార్కులు వచ్చాయో ఓ సారి చూద్దామా... అయితే పదండి మరి..

  సమంత ఈ ప్రోగ్రెస్‌ రిపోర్ట్స్‌ అలా సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడం ఆలస్యం మంచులక్ష్మి, రాధిక తదితరులు ట్విట్టర్‌ ద్వారా ప్రశంసించారు. బ్యూటీ విత్‌ బ్రెయిన్స్‌ అంటూ అభినందించారు.

  స్లైడ్ షోలో మిగితా విశేషాలు

  మొదట అమ్మా,నాన్నా

  తన ఇంట్లో తల్లి,తండ్రులతో ఉన్న సమంత...

  అమ్మా,నేను కలిసి

  ‘అమ్మ గర్వపడింది.. నాకు మాత్రం ఆశ్చర్యం వేసింది..' అంటూ ట్వీట్‌ చేసి ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది.

  కష్టపడితే..

  కష్టపడితే ఏ రంగంలోనే విజయం సాధించవచ్చని, ఈ సిద్ధాంతాన్నే మొదటినుంచి తాను నమ్మి, పాటిస్తున్నానని తెలిపింది.

  వెంటనే లైట్స్ ఆన్, కెమెరా

  మద్రాస్‌ విశ్వవిద్యాలయం నుంచి ఫస్ట్‌క్లాస్‌ డిస్టింక్షన్‌తో బీకామ్‌ పూర్తి చేసిన సమంత ఆ వెంటనే లైట్స్‌, కెమెరా, యాక్షన్‌ మొదలైందంటూ పేర్కొంది.

  లక్ష్మీ మంచు ఇలా...

  బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటూ లక్ష్మీ మంచు మెచ్చుకుంది.

  రాధిక ఇలా మెచ్చుకుంది

  సమంత ట్వీట్ చూసిన రాధిక ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించింది.

  తమన్

  సంగీత దర్శకుడు తమన్...తనకు పేరింటింగ్ కార్డులే ఉండేవని, ఎప్పుడూ రెడ్ మార్కులే అంటూ ఇదిగో ఇలా..

  ఓ జోక్

  తమన్ చాలా ఉత్సాహంగా ఓ జోక్ కూడా వేసాడు. ఆ జోకేంటో ఇక్కడ ట్వీట్ లో చూడండి.

  దర్శకుడు హరీష్ శంకర్

  ప్రముఖ దర్సకుడు హరీష్ శంకర్ సైతం ఉత్సాహంగా ఈ టాక్ ట్వీట్స్ లో పాల్గొని ఇలా అన్నారు.

  కార్తీక

  హీరోయిన్ కార్తీక ఇదిలో ఇలా ఓ లింక్ ఇచ్చి చదవమంది..ఇంతకీ లింక్ లో ఏముందో

  English summary
  Samantha had posted the image of her school report card saying that she found this when she and her mom was going through some old reports cards. She said it was indeed a surprise experience for her and mom. Mom was really proud after seeing that and she was surprised, says Samantha.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X