ఈ ఒక్క సంఘటన చాలా నేర్పించింది: సమంత

By Srikanya

హైదరాబాద్: ఆ మధ్యన హాట్ హీరోయిన్ సమంతకు హెల్త్ బాగోకపోవటంతో కొన్ని నెలలు పాటు షూటింగ్ లకు దూరమైంది. ఈ విషయం గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ తనకు వచ్చిన అనారోగ్యం మేలే చేసిందని చెప్తోంది. ఆమె మాటల్లోనే...కొన్ని నెలలు షూటింగ్‌లకు దూరమవటం... అనారోగ్యం వల్ల తప్పలేదు. రోగ నిరోధక శక్తి తగ్గిపోవడంతో ఆరోగ్యపరమైన కొన్ని సమస్యలు వచ్చాయి. అందుకే కాస్త విరామం తీసుకున్నాను. అయినా అనారోగ్యం మంచే చేసింది అంది.

అనారోగ్యం మంచే చేయటమేంటి అంటే... అనారోగ్యం వచ్చేవరకూ కేవలం నా గురించి మాత్రమే ఆలోచించేదాన్ని. అందరిలాగే నాలోనూ స్వార్థం ఉండేది. ఇప్పుడది లేదు. నలుగురికి మేలు చేయడం కంటే మించింది లేదనే సత్యాన్ని తెలుసుకున్నాను. జీవితంలో ఆటుపోట్లు సహజం. అవన్నీ పట్టించుకోకూడదు. ఈ ఒక్క సంఘటన నాకు చాలా విషయాలు నేర్పించింది అంది.

ఆ సంఘటన ప్రేరణతో 'ప్రత్యూష' పేరుతో ఓ సేవా సంస్థను కూడా నెలకొల్పాను. దీని ద్వారా మహిళలకు, చిన్న పిల్లలకు వీలైనంత సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారిని తగిన విధంగా ఈ సంస్థ ఆదుకుంటుంది అంది.

తాజా చిత్రం 'ఎటో వెళ్లిపోయింది మనసు' గురించి చెప్తూ... నా నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర. నిత్య అనే యువతిగా కనిపిస్తాను. ఈ కథ విన్న వెంటనే నచ్చింది. కానీ నేను చేయగలనా అనే ఆలోచన కూడా మొదలైంది. ఓ మంచి పాత్రకు న్యాయం చేయాలని చాలా కష్టపడ్డాను. 'ఏ మాయ చేసావె'లో జెస్సీలాగే నిత్య కూడా గుర్తుండిపోతుంది అంది.

'ఎటో వెళ్లిపోయింది మనసు' లో ప్రేమ కథ మూడు దశలుగా ఉంటుంది... స్కూల్‌ దశలో ఆలోచనలు ఎలా ఉంటాయి?.. అవి కళాశాల స్థాయికి వెళ్లాక ఏ రీతిన మారతాయి?.. ఆపైన మానసిక పరిపక్వతతో ఏం చేస్తారు?.. అనే అంశాల్ని చూపించారు. ఆ దశలను పాత్రలో ప్రతిఫలింపజేయడం క్లిష్టమైన ప్రక్రియే. దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ సూచనలకు తగ్గట్టు నటించాను అని చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X