»   » అలీ ‘బెంజి సర్కిల్’ కామెంట్స్‌పై సమంత స్పందన

అలీ ‘బెంజి సర్కిల్’ కామెంట్స్‌పై సమంత స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం ఆడియో సక్సెస్ మీట్లో కమెడియన్ అలీ సమంతపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఆడియో ఫంక్షన్లలో సైతం కాస్త బూతు పదాలు మాట్లాడే అలవాటు ఉన్న అలీ ఈ సారి ఏకంగా సమంత నడుము మీద కామెంట్స్ చేసారు. సమంత నాభి భాగాన్ని విజయవాడ బెంజి సర్కిల్ తో పోలుస్తూ వ్యాఖ్యలు చేసాడు.

సమంతను సౌందర్యరాశిగా పొగడ్తలు గుప్పించిన అలీ....తన చేతలతో నాభి భాగాన్ని చూపిస్తూ ‘ఈ ఏరియా అంటే నాకు చాలా ఇష్టం. బెంజిసర్కిల్ లా ఉంటుంది' అంటూ కామెంట్ చేసాడు. అలీ వ్యాఖ్యలపై అభిమానులు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేయగా సమంత కూడా ఫోన్ ద్వారా అలీ అక్షింతలు వేసినట్లు, తన గురించి మరోసారి అలా మాట్లాడితే బావుండదని గట్టిగా చెప్పినట్లు ఫిల్మ్ నగర్లో ప్రచారం జరిగింది.

Samantha has responded over Ali’s Benz circle comments

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత ఈ వివాదంపై స్పందించింది. ‘అలీ నాకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్. అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల్లో కలిసి పని చేసాం. నాకు తెలిసి ఆయన వివాదాస్పదంగా కామెంట్స్ ఏమీ చేయలేదనే అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అతనికి ఫోన్ చేయలేదు. ఈ విషయం గురించి చర్చించలేదు. ఆయన ఏ సందర్భంలో అలాంటి కామెంట్స్ చేసారో తెలియదు. నేను అతన్ని ఇది తప్పు ఇది ఒప్పు అని జడ్జ్ చేయలేను' అని వ్యాఖ్యానించింది.

సమంత వ్యాఖ్యలు చూస్తుంటే.....తన నడుముపై అలీ చేసిన కామెంట్లను లైట్ తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. అయినా సినిమాల్లో ఇలాంటివి కామన్....బొడ్డు గురించి, నడుము గురించి కామెంట్స్ చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది పరిశ్రమ వర్గాల మాట. కేవలం వార్తల కోసమే మీడియా వారు దీన్ని పెద్ద రాద్దాంతం చేస్తున్నారని ఫిల్మ్ నగర్ జనాల మాట.

    English summary
    Samantha has responded over Ali’s Benz circle comments. While interacting at the recently held press meet, Samantha said “Ali is best friend in the industry. We worked together for Attarintiki Daredi and S/O Satyamurthy. I know he is not saying those comments as controversial, I never called him and I did not discuss this issue through mobile. I know, in which situation he pointed out and made comments on me. I never judge him”.
    Please Wait while comments are loading...