»   » “మనం” దర్శకుడు 24 లో సమంత...(ఆన్ లొకేషన్ ఫొటోలు)

“మనం” దర్శకుడు 24 లో సమంత...(ఆన్ లొకేషన్ ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సమంత...ఇప్పుడు తమిళంలో ఫుల్ బిజీగా ఉంది. ఆమె ఓ ప్రక్క విక్రమ్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో చేస్తూ మరో ప్రక్క సూర్య హీరోగా రూపొందుతున్న చిత్రంలోనూ చేస్తోంది. ఈ చిత్రాన్ని అక్కినేని కుటుంబంతో "మనం" తీసి హిట్ కొట్టిన దర్శకుడు విక్రమ్ కుమార్ డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం కధాంశం చాలా విభిన్నమైనదని తెలుస్తోంది. సమంత పూర్తి మిడిల్ క్లాస్ అమ్మాయి లుక్ తో కనిపిస్తే... హీరో సూర్య.... మాస్ గా కనిపించి అలరించనున్నారు. ఈ మేరకు ఆన్ లొకేషన్ ఫొటోలు బయిటకు వచ్చాయి. మీరు ఓ లుక్కేయండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిత్రం వివరాల్లోకి వెళితే... సూర్య, దర్శకుడు విక్రమ్ కుమార్ కాంబినేషన్లో '24' పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సమంత హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను సూర్య తన సొంత బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు.

ఇప్పటికే ‘మాస్' సినిమాను పూర్తి చేసిన సూర్య ఈ మధ్యే విక్రమ్ కుమార్ '24' సినిమా షూటింగ్‌కు షిఫ్టైపోయాడు. ఏప్రిల్ 9న మొదలైన ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో హీరోయిన్ సమంత కూడా పాల్గొంది. ఈ సినిమా ఎక్కువ భాగం ముంబై నేపథ్యంలో నడవనున్నట్లు తెలుస్తోంది. మొదటి షెడ్యూల్‌లో సమంత పార్ట్ ఇప్పటికే పూర్తైంది. ఫస్ట్ షెడ్యూల్‌లో తన పార్ట్ పూర్తి చేసుకున్న సందర్భంగా.. '24' సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉందని సమంత ట్వీట్ చేసింది.

ఇంతకు ముందు సూర్య హీరోగా వచ్చిన అంజాన్(సికిందర్) చిత్రంలోనూ సమంత హీరోయిన్ గా చేసింది. అయితే ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. కానీ ఈ సారి అటువంటి అవకాసమే లేదంటున్నారు. ఖచ్చితంగా ఈ కథాంశం..సమంత క్యారక్టరైజేషన్ ప్రేక్షకులకు పడుతుందని చెప్తున్నారు. ఇక సమంత కూడా రెండో సారి విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చేస్తోంది. ఇంతుకుముందు...అక్కినేని కుటుంబంతో చేసిన మనంలో సమంత ...నాగచైతన్యకు పెయిర్ గా చేసింది. ఆ సినిమా విజయవంతం అయ్యింది. తనను ఈ సినిమాలోనూ డిఫెరెంట్ గా చూపిస్తాడంటూ మురిసిపోతోంది సమంత.

24 ఆన్ లొకేషన్ లో సమంత,సూర్య, దర్సకుడు ఫొటోలు..

సైన్స్ ఫిక్షన్...

సైన్స్ ఫిక్షన్...

'13బీ', ‘ఇష్క్', ‘మనం' చిత్రాల ద్వారా సరికొత్త కథాంశాలతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ సినిమాను ఓ సైన్స్ ఫిక్షన్‌ కథతో తెరకెక్కించనున్నట్లు సమాచారం.

ఒకేసారి..

ఒకేసారి..

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో డిసెంబర్ నెల్లో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

సంగీతం అదుర్స్

సంగీతం అదుర్స్

'24' సినిమాకు ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మేరకు ఇప్పటికే రహమాన్ కొన్ని ట్యూన్స్ వినిపించి ఓకే చేయించుకున్నట్లు సమాచారం.

టెక్నికల్ టీమ్ వీళ్లే..

టెక్నికల్ టీమ్ వీళ్లే..

‘మనం' సినిమాకు వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్, ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్, ఎడిటర్ ప్రవీణ్ పూడి ఈ సినిమాకు సైతం వర్క్ చేస్తున్నారు.

బ్రేక్ లో ఉన్నారు

బ్రేక్ లో ఉన్నారు

ఏప్రిల్ 8న ముంబైలో ప్రారంభమైన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల పూర్తయింది. కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ చిత్రీకరించారు. ప్రస్తుతం యూనిట్ చిన్న బ్రేక్ తీసుకుంది. త్వరలో రెండవ షెడ్యూల్ మొదలవుతుందని దర్శకుడు తెలిపారు.

English summary
Titled “24”, the shooting of this flick is going on at a brisk space in Mumbai and Chennai. Recently both Surya and Samantha are shooting for this film along with director Vikram. These exclusive pictures are shot on location.
Please Wait while comments are loading...