జూ ఎన్టీఆర్ ప్రియురాలి వెనుక కురాళ్ళోయ్ కుర్రాళ్ళు....
'ఏ మాయ చేసావె" తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన అందాల భామ సమంత నాయికగా రూపొందిన చిత్రం 'కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు". తమిళంలో ఇటీవల విడుదలైన 'బానా కాత్తాడి" చిత్రాన్ని ఈ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. నటుడు మురళి తనయుడు ఆదర్శ కథానాయకుడిగా నటించారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని 5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై శ్రీనివాస్ దామెర తెలుగులోకి అందిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ 'తమిళంలో మంచి విజయం సాధించిన సినిమా ఇది. ఈ చిత్రం రైట్స్ ను మాకు ఇచ్చినందుకు సత్యజ్యోతి ఫిలిమ్స్ అధినేత టి. త్యాగరాజన్ కు కృతజ్ఝతలు. ఈ చిత్రానికి యువన్ సంగీతం పెద్ద ఎస్సెట్. చిచ్రంలోని ఆరు పాటలకు వీనులవిందైన బాణీలను అందించారు. పాటల రికార్డింగ్ పూర్తయింది. ప్రస్తుతం డీటీయస్ మిక్సింగ్ జరుగుతోంది. అక్టోబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ"ని అన్నారు. బద్రి వెంకటేష్ దర్శకుడు.
ప్రస్తుతం విడుదలకు సిద్దంగా ఉన్న జూ ఎన్టీఆర్ బృందావనంలో మెయిన్ హీరోయిన్ గా నటించింది. అలాగే మహేష్ బాబు సరసన దూకుడు చిత్రంలో నటించనుందని సమాచారం.


Click it and Unblock the Notifications











